Share News

Champions Trophy 2025: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాయాది ఔట్

ABN , Publish Date - Nov 12 , 2024 | 11:10 AM

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలిందని తెలుస్తోంది. మెగా టోర్నీని పాక్ నుంచి వేరే దేశానికి తరలించాలని ఐసీసీ డిసైడ్ అయిందని సమాచారం.

Champions Trophy 2025: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాయాది ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీ పంచాయితీ రోజురోజుకీ మరింత ముదురుతోంది. ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని భారత్ తెగేసి చెప్పింది. భద్రతా కారణాల రీత్యా ఆ దేశానికి టీమిండియాను పంపొద్దని బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఐసీసీకి బోర్డు కరాఖండీగా చెప్పింది. దీంతో టోర్నీ నిర్వహణ సందిగ్ధతలో పడింది. తమ మ్యాచుల్ని హైబ్రిడ్ మోడల్‌లో ఇతర వేదికలో నిర్వహించాలని భారత్ డిమాండ్ చేస్తుండగా.. ఆడితే పాక్‌లో ఆడాలి, హైబ్రిడ్‌కు మాత్రం ఒప్పుకోబోమని పాక్ బోర్డు అంటోంది. ఈ తరుణంలో పాక్‌కు గట్టి షాక్ తగిలిందని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాయాది ఔట్ అనే వార్తలు వస్తున్నాయి. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


ఆ దేశంలో మ్యాచులు?

పాకిస్థాన్‌ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీని తరలించాలని ఐసీసీ డిసైడ్ అయిందని తెలుస్తోంది. సౌతాఫ్రికాలో మెగా టోర్నీ నిర్వహణకు ప్లాన్ చేస్తోందని సమాచారం. బీసీసీఐ రిక్వెస్ట్‌తో టీమిండియా మ్యాచులతో పాటు ఫైనల్ మ్యాచ్‌ను హైబ్రిడ్ మోడల్‌లో యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ భావించిందట. ఇదే విషయం పీసీబీకి చెప్పి ఒప్పుకోవాలని కోరిందట. హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచులు జరిగినా హోస్టింగ్ ఫీజు కంప్లీట్‌గా చెల్లిస్తామని చెప్పిందట. కానీ దాయాది బోర్డు ఒప్పుకోకపోవడంతో ఆ దేశం నుంచి ఛాంపియన్స్ ట్రోఫీని సౌతాఫ్రికాకు తరలించాలని డిసైడ్ అయిందట. పాక్ ఆతిథ్య హక్కుల్ని క్యాన్సిల్ చేసే ప్రక్రియ కూడా మొదలైందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.


ఆడేదేలే!

సౌతాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే ఇటు భారత్‌కు ఇబ్బంది ఉండదు, అటు పాక్ కూడా తప్పక ఆడాల్సిందే అనేది ఐసీసీ ప్లాన్ అని తెలుస్తోంది. టీమిండియా ఆడకపోతే తీవ్ర నష్టం వచ్చే ప్రమాదం ఉండటంతో టోర్నీ తరలింపు కోసం అత్యున్నత క్రికెట్ బోర్డు నడుం బిగించిందని సమాచారం. అయితే భారత్ గనుక తమ దేశానికి రాకపోయినా, ఛాంపియన్స్ ట్రోఫీని ఇతర వేదికలకు తరలించినా ఇక మీదట ఐసీసీ టోర్నీల్లో టీమిండియాతో మ్యాచుల్ని బహిష్కరించాలని పాకిస్థాన్ అనుకుంటోందట. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌తో మ్యాచులు ఆడొద్దని అనుకుంటోందట. దీంతో ఈ వివాదం మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.


Also Read:

సౌతాఫ్రికాతో మూడో టీ20.. 2 మార్పులతో బరిలోకి భారత్

జ్యోతి సురేఖకు కాంస్యం

రష్మిక @: 1

For More Sports And Telugu News

Updated Date - Nov 12 , 2024 | 11:16 AM