PM Modi: అశ్విన్.. అదొక్కటి మర్చిపోకు.. స్టార్ స్పిన్నర్‌కు ప్రధాని సజెషన్
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:40 PM
Ravichandran Ashwin: రీసెంట్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ కీలక సూచనలు చేశారు. గేమ్‌కు గుడ్‌బై చెప్పినా.. ఆ విషయం మాత్రం అశ్విన్ మర్చిపోవద్దని ఆయన అన్నారు.
రీసెంట్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మీద అన్ని వైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలు, జట్టుకు సుదీర్ఘ కాలం ఆడటం, ఐసీసీ ట్రోఫీలు నెగ్గడంలో కీలకపాత్ర వహించడాన్ని అంతా గుర్తుచేసుకుంటున్నారు. దేశానికి అతడు అందించిన సేవలకు గానూ ఖేల్ రత్న పురస్కారంతో సత్కరించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ తరుణంలో అశ్విన్ రిటైర్మెంట్‌పై దేశ ప్రధాని నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు అతడ్ని అభినందిస్తూ స్పెషల్‌గా ఓ లెటర్ రాశారు. రిటైర్మెంట్ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసిందని అందులో రాసుకొచ్చారు మోడీ.
అమ్మ ఆస్పత్రిలో ఉన్నా..
వరల్డ్‌వైడ్‌గా ఉన్న క్రికెట్ లవర్స్ అంతా అశ్విన్ నిర్ణయం తెలిసి షాక్ అయ్యారని ఆ లేఖలో మోడీ ప్రస్తావించారు. ఆఫ్ బ్రేక్స్ డెలివరీస్‌తో పాటు క్యారమ్ బాల్స్‌తో అపోజిషన్ బ్యాటర్లను అతడు హడలెత్తించాడని మెచ్చుకున్నారు. రిటైర్మెంట్ నిర్ణయం క్యారమ్ బాల్ మాదిరిగా ఉందని చమత్కరించారు మోడీ. ఇది కఠిన నిర్ణయమని అన్నారు. అయితే టీమిండియాకు అశ్విన్ అందించిన సేవలు అద్భుతమన్నారు. టీమ్ కోసం అతడు తన పర్సనల్ లైఫ్‌ను పక్కనబెట్టాడని.. తన అమ్మ ఆస్పత్రిలో ఉన్నా జట్టు కోసమే ఆలోచించాడంటూ అశ్విన్‌పై మోడీ ప్రశంసల జల్లులు కురిపించారు. చెన్నై వరదల టైమ్‌లోనూ అతడు టీమ్‌తో ఉన్నాడని.. ఇక మీదట జెర్సీ నంబర్ 99ని ఫ్యాన్స్ అంతా మిస్ అవబోతున్నారని వ్యాఖ్యానించారు మోడీ.
వాటే క్రికెట్ బ్రెయిన్
అశ్విన్‌కు మోడీ కీలక సూచనలు చేశారు. గేమ్‌కు గుడ్‌బై చెప్పినా.. యూట్యూబ్‌లో ‘కుట్టి స్టోరీస్’ను మాత్రం అతడు కొనసాగించాలని సజెషన్ ఇచ్చారు. ఇదొక్కటి మర్చిపోవద్దన్నారు. అశ్విన్‌ది చురుకైన క్రికెట్ బ్రెయిన్ అని.. అతడి అనుభవాన్ని తప్పకుండా భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు మోడీ. గ్రౌండ్‌లోనే కాదు బయట కూడా క్రీడా రాయబారిగా భారత్ గర్వపడేలా చేశాడని మెచ్చుకున్నారు. అమ్మానాన్నలతో పాటు సతీమణి ప్రీతి, కుమార్తెల త్యాగం వల్లే అశ్విన్ దేశం గర్వపడే క్రికెటర్‌గా మారాడని పేర్కొన్నారు మోడీ. ఇక నుంచి అతడు తన ఫ్యామిలీకి మరికాస్త ఎక్స్‌ట్రా టైమ్ కేటాయిస్తాడని ఆశిస్తున్నానని ప్రధాని వివరించారు.
Also Read:
చాంపియన్‌గా టీమిండియా.. అమ్మాయిలు కప్పు కొట్టేశారు..
సీఎస్‌కే చిచ్చరపిడుగు విధ్వంసం.. 97 బంతుల్లోనే డబుల్ సెంచరీ
రిటైరైనా ఫిట్‌నెస్‌లో బాప్.. ఈ బ్యాటింగ్ రాక్షసుడ్ని గుర్తుపట్టారా..
For More Sports And Telugu News