Ravichandran Ashwin: అశ్విన్ సంచలన నిర్ణయం.. రోహిత్ సమక్షంలోనే..
ABN , Publish Date - Dec 18 , 2024 | 11:50 AM
Ravichandran Ashwin: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సమక్షంలో అతడు తన డెసిషన్ ప్రకటించాడు.
IND vs AUS: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అతడు అనౌన్స్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సమక్షంలో మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు తన డెసిషన్ ప్రకటించాడు.
భజ్జీకి పర్ఫెక్ట్ రీప్లేస్‌మెంట్
అశ్విన్ భారత జట్టులోకి అడుగుపెట్టి 13 ఏళ్లు కావొస్తోంది. వెస్టిండీస్ మీద 2011లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడీ ఆఫ్ స్పిన్నర్. ఆ తర్వాత క్రమంగా వన్డే, టీ20 టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత ఆ ప్లేస్‌ను భర్తీ చేసిన అశ్విన్.. క్రమంగా స్టార్‌గా ఎదిగాడు. ముఖ్యంగా టెస్టుల్లో తోపు బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మొత్తంగా 106 టెస్టులు ఆడిన అశ్విన్.. 537 వికెట్లు తీశాడు. బ్యాట్‌తోనూ దుమ్ములేపాడు. 3,503 పరుగులు చేశాడు. ఇందలో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 114 వికెట్లు, టీ20ల్లో 65 వికెట్లు పడగొట్టాడు అశ్విన్. టీమిండియా స్పిన్ భారాన్ని ఏళ్ల పాటు మోసిన ఈ లెజెండ్ ఫ్యాన్స్ హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాడని చెప్పొచ్చు.
Also Read:
బుమ్రా స్టన్నింగ్ డెలివరీ.. బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్
రివేంజ్ తీర్చుకున్న సిరాజ్.. మియా పగబడితే ఇలాగే ఉంటది
కెరీర్ క్లోజ్.. రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చేసిన రోహిత్..
చెప్పాడు.. చేశాడు.. మాట నిలబెట్టుకున్న బుమ్రా
దేవుడా.. ఇంకెన్ని చేయాలి!
For More Sports And Telugu News