Ravindra Jadeja: ఇలా జరుగుతుందని అనుకోలేదు.. అంతా తారుమారు: జడేజా
ABN , Publish Date - Nov 02 , 2024 | 09:16 AM
Ravindra Jadeja: టీమిండియాను ఓడించడం అంత ఈజీ కాదు. అందునా సొంతగడ్డ మీద మన జట్టును ఆపడం అంటే తలకు మించిన పనే. స్వదేశంలో మ్యాచ్ ఉంటే మనోళ్లు పులుల్లా చెలరేగి ఆడతారు. కానీ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అంతా తారుమారైంది. దీనిపై సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రియాక్ట్ అయ్యాడు.
IND vs NZ: టీమిండియాను ఓడించడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ మన జట్టు హవా నడుస్తోంది. మనతో మ్యాచ్ అంటే బడా టీమ్స్ కూడా భయపడుతున్నాయి. మెన్ ఇన్ బ్లూ ఆడిన ప్రతి చోట అదరగొడుతోంది. భారత్‌ను ఓడించడం చాలా కష్టంగా మారుతోంది. ఇంక సొంతగడ్డ మీద మన జట్టుకు తిరుగులేదనే చెప్పాలి. ఇక్కడ మ్యాచ్‌లు ఉంటే భారత ప్లేయర్లు పులుల్లా చెలరేగి ఆడతారు. అందునా టెస్టుల్లో అయితే ఎదురొచ్చిన ప్రతి జట్టును చిత్తుగా ఓడించి పంపుతారు. కానీ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అంతా తారుమారైంది. మూడు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే 0-2తో కోల్పోయిన రోహిత్ సేన.. ఆఖరి టెస్టులోనూ వెనుకంజలో ఉంది. దీనిపై సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రియాక్ట్ అయ్యాడు.
ఓటమిని ఊహించలేదు
సొంతగడ్డ మీద భారత్ సిరీస్ ఓడుతుందని ఎప్పుడూ అనుకోలేదన్నాడు జడేజా. ఇది తాను ఊహించలేదని, అంతా తారుమారైందన్నాడు. తన లైఫ్‌లో ఇలాంటిది చూస్తానని అనుకోలేదన్నాడు. తాను టీమిండియాకు ఆడినన్ని రోజులు సొంతగడ్డపై టెస్టుల్లో సిరీస్ ఓటమి రాదని అనుకున్నానని.. కానీ ఇప్పుడు పరాభవం ఎదురైందన్నాడు. హోం సిరీస్‌ల్లో అజేయంగా ఉన్నామని.. వరుసగా 18 సిరీస్‌లు గెలిచామన్నాడు. కానీ ఎట్టకేలకు ఓటమి రుచి చూడక తప్పలేదన్నాడు జడ్డూ. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగి సిరీస్ ఓడటం తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందన్నాడీ స్పిన్ ఆల్‌రౌండర్.
కివీస్‌ను తిప్పేసిన జడ్డూ
తొలి రెండు టెస్టుల్లో ఓటమితో బాధలో ఉన్న జడేజా ఆఖరి మ్యాచ్‌లో భారత్ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో 22 ఓవర్లలో 65 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడతను. అతడితో పాటు యంగ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (4/81) రాణించడంతో కివీస్‌ను 235 పరుగులకు కట్టడి చేసింది రోహిత్ సేన. అయితే ఆ తర్వాత మన బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా స్కోరు 4 వికెట్ల నష్టానికి 86. వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకోవాలంటే రాబోయే కొన్ని సెషన్ల పాటు భారత ఆటగాళ్లు తమ బెస్ట్ గేమ్‌ను బయటకు తీయాల్సి ఉంటుంది.
Also Read:
విజేత సంజన
సుదర్శన్, పడిక్కళ్ అర్ధ శతకాలు
భారత టూర్‌కు సఫారీ సైన్యమిదే!
For More Sports News And Telugu News