Share News

Robin Uthappa: అరెస్ట్ వారెంట్‌పై ఊతప్ప రియాక్షన్.. ఇలా అనేశాడేంటి..

ABN , Publish Date - Dec 22 , 2024 | 01:59 PM

Robin Uthappa: పీఎఫ్ చెల్లింపుల కేసులో తన మీద అరెస్ట్ వారెంట్ జారీ అవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప స్పందించాడు. తప్పంతా వాళ్లదేనని అన్నాడు. ఇంకా ఊతప్ప ఏం అన్నాడంటే..

Robin Uthappa: అరెస్ట్ వారెంట్‌పై ఊతప్ప రియాక్షన్.. ఇలా అనేశాడేంటి..
Robin Uthappa

ఉద్యోగుల పీఎఫ్ చెల్లింపుల కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ విషయం కాస్త లేటుగా వెలుగులోకి వచ్చింది. అయితే క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పనేదో తాను చేసుకుపోయే ఊతప్ప ఇలా మోసం చేయడం ఏంటి? అంటూ క్రికెట్ లవర్స్ అంతా షాక్ అయ్యారు. తన మీద వస్తున్న ఆరోపణల మీద ఎట్టకేలకు ఊతప్ప స్పందించాడు. ఈ మేరకు ఆరోపణలపై వివరణ ఇస్తూ ఓ ప్రకటన చేశాడీ బ్యాటింగ్ స్టార్. ఈ కంపెనీలో తాను ఎలాంటి ఎగ్జిక్యూటివ్ రోల్ పోషించడం లేదని స్పష్టం చేశాడు. తప్పంతా వాళ్లదే అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.


సంబంధం లేదు

‘నా మీద పీఎఫ్ కేసు నమోదవడంపై న్యూస్ వచ్చింది. వాటికి వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అనౌన్స్‌మెంట్ చేస్తున్నా. సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 2018-19లో డైరెక్టర్‌గా నేను నియమితుడినయ్యా. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడంతో ఆ పదవిని నాకు ఇచ్చారు. ఆ సంస్థలో లోన్ల రూపంలో నేను ఫండ్స్ ఇచ్చా. కానీ యాక్టివ్ ఎగ్జిక్యూటివ్ రోల్‌ను ఎప్పుడూ పోషించలేదు. అలాగే కంపెనీ రోజువారీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్‌గా, కామెంటేటర్‌గా, టీవీ ప్రెజెంటర్‌గా నేను చాలా బిజీగా ఉంటా. అందుకే కంపెనీ కార్యక్రమాల్లో ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు’ అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.


నా డబ్బులు ఎగ్గొట్టారు

సెంటారస్‌తో పాటు కొన్ని ఇతర సంస్థల్లోనూ తాను పెట్టబడులు పెట్టానని ఊతప్ప తెలిపాడు. అక్కడ కూడా ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వర్తించలేదని ప్రకటనలో స్పష్టం చేశాడు. తాను ఇచ్చిన ఫండ్స్‌ను తిరిగి చెల్లించడంలో ఆ కంపెనీ ఫెయిలైందని.. అందుకే న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యానని క్లారిటీ ఇచ్చాడు. కొన్నాళ్ల కింద డైరెక్టర్ పోస్ట్‌కు తాను రాజీనామా చేశానని పేర్కొన్నాడు ఊతప్ప. పీఎఫ్ అధికారులు పేమెంట్ చేయాలని నోటీసులు జారీ చేశారన్న వెటరన్ ప్లేయర్.. తన లీగల్ టీమ్ దానిపై స్పందించిందన్నాడు. పీఎఫ్ నిధుల దుర్వినియోగం విషయంలో తన ఇన్‌వాల్వ్‌మెంట్ లేదని.. ఈ సమస్యను త్వరలోనే అధిగమిస్తానని ఊతప్ప ఆశాభావం వ్యక్తం చేశాడు.


Also Read:

హెల్మెట్‌లో కెమెరాతో బ్యాటింగ్.. అశ్విన్ మామూలోడు కాదు

అశ్విన్.. అదొక్కటి మర్చిపోకు.. స్టార్ స్పిన్నర్‌కు ప్రధాని సజెషన్

సీఎస్‌కే చిచ్చరపిడుగు విధ్వంసం.. 97 బంతుల్లోనే డబుల్ సెంచరీ

రిటైరైనా ఫిట్‌నెస్‌లో బాప్.. ఈ బ్యాటింగ్ రాక్షసుడ్ని గుర్తుపట్టారా..

For More Sports And Telugu News

Updated Date - Dec 22 , 2024 | 01:59 PM