Rohit Sharma: రోహిత్ శర్మనా మజాకా.. దెబ్బకు ఆ రికార్డులన్ని గల్లంతు
ABN , Publish Date - Jun 25 , 2024 | 05:08 PM
టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భాగంగా.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎలా ఊచకోత కోశాడో అందరికీ తెలుసు. క్రీజులో అడుగుపెట్టినప్పటి..
టీ20 వరల్డ్‌కప్‌లోని (T20 World Cup) సూపర్-8లో భాగంగా.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎలా ఊచకోత కోశాడో అందరికీ తెలుసు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే ఎడాపెడా షాట్లతో తాండవం చేసి.. ఆసీస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. కేవలం 41 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సుల సహకారంతో 92 పరుగులు చేసి.. జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇదే సమయంలో కొన్ని అరుదైన ఘనతలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
రోహిత్ సాధించిన రికార్డులు
* ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ పుణ్యమా అని.. రోహిత్ ఓ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు బాబర్ ఆజమ్ (4145) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ (4165) అతనిని అధిగమించి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
* ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 8 సిక్సులు బాదడంతో.. 200 సిక్సుల మార్క్‌ని దాటేశాడు. దీంతో.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఏకైక ప్లేయర్‌గా అతను సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇతర ఆటగాళ్లెవరూ అతని దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం.
* ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే అర్థశతకం చేసి.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన భారతీయుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. అదే కెప్టెన్ పరంగా చూసుకుంటే.. టీ20 వరల్డ్‌కప్‌లో క్రిస్ గేల్ (98) తర్వాత రోహిత్ (92) రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
* టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాళ్లలో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. సురేశ్ రైనా 101 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. 2010లో సౌతాఫ్రికాపై అతను ఆ స్కోరు చేశాడు. ఇక 89 పరుగులతో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.
* ఆస్ట్రేలియాపై సాధించిన విజయంతో.. బాబర్ ఆజం రికార్డ్‌ని రోహిత్ సమం చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా బాబర్‌తో సమానంగా నిలిచాడు. అయితే.. బాబర్ 85 మ్యాచ్‌ల్లో 48 విజయాలు సాధిస్తే.. రోహిత్ కేవలం 60 మ్యాచ్‌ల్లోనే ఆ మార్కుని అందుకున్నాడు.
* ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సిక్సులు కొట్టిన జాబితాలో రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. కేవలం ఆస్ట్రేలియా జట్టుపై అతను ఏకంగా 132 సిక్సులు బాదాడు. ఈ లిస్టులో రోహిత్ తర్వాత క్రిస్ గేల్ ఇంగ్లండ్‌పై 130 సిక్సులతో రెండో స్థానంలో నిలిచాడు.
Read Latest Sports News and Telugu News