Rohit Sharma: సచిన్‌నే సాగనంపారు.. రోహిత్‌కు ఎందుకీ వీఐపీ ట్రీట్‌మెంట్..
ABN , Publish Date - Dec 27 , 2024 | 08:55 PM
Boxing Day Test: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు అతడి బ్యాటింగ్ ఫెయిల్యూర్, మరోవైపు టీమ్ పెర్ఫార్మెన్స్ రెండు పడిపోవడంతో హిట్‌మ్యాన్‌ను అంతా ఏకిపారిస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు అతడి బ్యాటింగ్ ఫెయిల్యూర్, మరోవైపు టీమ్ పెర్ఫార్మెన్స్ రెండు పడిపోవడంతో హిట్‌మ్యాన్‌ను అంతా ఏకిపారేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటిదాకా ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతడు చేసిన పరుగులు 22 మాత్రమే. టీమ్ కూడా ఒక మ్యాచ్‌లో గెలిచి ఇంకో దాంట్లో ఓడిపోయింది. మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. బాక్సింగ్ డే టెస్ట్‌లోనూ టీమిండియా వెనుకంజలో ఉంది. ఇతర ఆటగాళ్ల వైఫల్యం కంటే సారథి రోహిత్ ఫెయిల్యూర్ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఎన్నిసార్లు ఫెయిలైనా అతడ్ని టీమ్‌లో నుంచి మాత్రం పక్కన పెట్టడం లేదు.
ముమ్మాటికీ తప్పే!
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో వరుస వైఫల్యాలకు అతడ్ని బలి చేశారని.. రోహిత్ సహా కోహ్లీ, జడేజా సేఫ్ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా హిట్‌మ్యాన్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ రియాక్ట్ అయ్యాడు. భవిష్యత్ క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకొని లెజెండ్ సచిన్ టెండూల్కర్‌నే సాగనంపారని.. రోహిత్‌ను ఎందుకు వదిలేస్తున్నారంటూ మంజ్రేకర్ సీరియస్ అయ్యాడు. ఓపెనింగ్‌లో బాగా ఆడుతున్న కేఎల్ రాహుల్‌ను కిందకు నెట్టి హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదంటూ ఫైర్ అయ్యాడు.
Also Read:
సంజూ శాంసన్‌కు బిగ్ షాక్.. ఇక టీమిండియాలోకి నో ఎంట్రీ..
కోహ్లీని అవమానించిన ఆసీస్.. కనీస గౌరవం కూడా ఇవ్వకుండా..
మాట తప్పిన రోహిత్.. కెప్టెన్ అని నమ్మితే నిండా ముంచాడు..
పంతం నెగ్గించుకున్న ఆసీస్.. 11 మంది కలసి మరీ..
For More Sports And Telugu News