Share News

Rohit-Jadeja: జడేజాకు క్లాస్ పీకిన రోహిత్.. పిచ్చి పట్టిందా అంటూ..

ABN , Publish Date - Dec 29 , 2024 | 06:26 PM

IND vs AUS: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపుగా కామ్‌గా, కూల్‌గానే ఉంటాడు. కానీ తేడా వస్తే మాత్రం సీరియస్ అవుతాడు. అవతల ఉన్నది ఎవ్వరైనా సరే ఇచ్చిపడేస్తాడు. ఈసారి మరో క్రికెటర్‌కు క్లాస్ పీకాడు హిట్‌మ్యాన్.

Rohit-Jadeja: జడేజాకు క్లాస్ పీకిన రోహిత్.. పిచ్చి పట్టిందా అంటూ..
Rohit Sharma

IND vs AUS: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపుగా కామ్‌గా, కూల్‌గానే ఉంటాడు. జట్టు ఎంత ఒత్తిడిలో ఉన్నా, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా అతడు మాత్రం ప్రశాతంగా ఉంటూ తన పని తాను చేసుకుంటాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛగా ఆడమంటూ ప్రోత్సహిస్తాడు. అయితే ఎవరైనా పదే పదే తప్పులు చేసినా, చెప్పిన మాట వినకపోయినా, గేమ్‌ను లైట్ తీసుకున్నా హిట్‌మ్యాన్ కోపం కట్టలు తెంచుకుంటుంది. తేడా వస్తే అతడు సీరియస్ అవుతాడు. అవతల ఉన్నది ఎవ్వరైనా సరే ఇచ్చిపడేస్తాడు. ఈసారి అతడి చేతిలో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు మూడింది. జడ్డూకు గట్టిగా క్లాస్ పీకాడు హిట్‌మ్యాన్. అసలు ఏం జరిగింది? జడేజా చేసిన తప్పేంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


ఆసీస్ ఆటగాళ్లతో జడ్డూ..

మెల్‌బోర్న్ సెకండ్ టెస్ట్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సమయంలో జడేజాపై రోహిత్ ఫైర్ అయ్యాడు. అప్పటికే కంగారూలు మంచి పొజిషన్‌కు చేరుకున్నారు. ఆ టీమ్ ఆధిక్యం 300 పరుగులు దాటింది. క్రీజులో ఉన్న నాథన్ లియాన్ (41 నాటౌట్), స్కాట్ బోలాండ్ (10 నాటౌట్) కలసి ఆఖరి వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. 9 మందిని ఔట్ చేసిన భారత బౌలర్లు.. ఈ ద్వయాన్ని మాత్రం విడదీయలేకపోయారు. దీంతో అటు ఆటగాళ్లలో ఇటు అభిమానుల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. అయితే క్రీజులో ఉన్న ప్రత్యర్థి బ్యాటర్లతో జడేజా మాత్రం నవ్వుల్లో మునిగిపోయాడు. బౌలింగ్ చేస్తూనే గ్యాప్‌లో వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించాడు. ఇది సారథి రోహిత్ కంటపడింది.


నవ్వితే ఊరుకోను!

మ్యాచ్‌లో ప్రతి పరుగు, ప్రతి వికెట్ కీలకంగా మారిన దశలో జడేజా కాస్త లైట్ తీసుకున్నట్లు కనిపించడం, ఆసీస్ బ్యాటర్లతో నవ్వుల్లో మునిగిపోవడం హిట్‌మ్యాన్‌కు నచ్చలేదు. దీంతో అతడిపై సీరియస్ అయ్యాడు. పిచ్చి లేసిందా అంటూ ఫైర్ అయ్యాడు. ‘జడ్డూ.. ఈ ఎండ్‌లో నుంచి బౌలింగ్ చెయ్.. ఏం జరుగుతుందో చూద్దాం. వాళ్ల (ఆస్ట్రేలియా బ్యాటర్లు) ముందు నవ్వకు’ అని వార్నింగ్ ఇచ్చాడు రోహిత్. పక్కనే ఉన్న కీపర్ రిషబ్ పంత్ వాతావరణాన్ని కాస్త తేలికపర్చేందుకు ప్రయత్నించాడు. ఇలాగే బౌలింగ్ చెయ్ అంటూ జడేజాను ఎంకరేజ్ చేశాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


Also Read:

సంద్రంలో సారా.. వెకేషన్‌లో క్రికెట్ గాడ్ డాటర్

నితీష్ రెడ్డికి అరుదైన గౌరవం.. సచిన్ సరసన తెలుగోడు..

బుమ్రా పగబడితే ఇట్లుంటది.. బెయిల్స్ వెతకడానికి టైమ్ సరిపోదు..

అది ‘బాహుబలి’ ఫోజు కాదు.. సీక్రెట్ రివీల్ చేసిన నితీష్

For More Sports And Telugu News

Updated Date - Dec 29 , 2024 | 06:26 PM