Share News

Rohit Sharma: మాట తప్పిన రోహిత్.. కెప్టెన్ అని నమ్మితే నిండా ముంచాడు..

ABN , Publish Date - Dec 27 , 2024 | 04:42 PM

Boxing Day Test: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట ఇస్తే నిలబడతాడు. తాను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అన్నంత భరోసా ఇస్తాడు. ఏం చెప్పాడో అదే చేయడం హిట్‌మ్యాన్ స్టైల్. కానీ ఈసారి మాట తప్పాడు భారత సారథి.

Rohit Sharma: మాట తప్పిన రోహిత్.. కెప్టెన్ అని నమ్మితే నిండా ముంచాడు..
Rohit Sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంత ఈజీగా మాట ఇవ్వడు. ఏదైనా ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్నాకే మాట్లాడతాడు. ఒకవేళ మాట గానీ ఇస్తే దాని మీద బలంగా నిలబడతాడు. తాను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అన్నంత భరోసా ఇస్తాడు. ఏం చెప్పాడో అదే చేయడం హిట్‌మ్యాన్ స్టైల్. కానీ ఈసారి మాట తప్పాడు భారత సారథి. కెప్టెన్ అని నమ్మితే జట్టును నిండా ముంచాడు. అతడి వల్లే టీమిండియాకు ఈ పరిస్థితి తలెత్తిందనే అపవాదు మూటగట్టుకున్నాడు. అసలు రోహిత్ చేసిన తప్పేంటి? అతడు ఇచ్చిన మాట ఏంటి? మాట తప్పడం వల్ల మెన్ ఇన్ బ్లూకు వచ్చిన నష్టం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


మార్చి సాధించిందేంటి?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్‌లో రోహిత్ ఆడలేదు. కొడుకు పుట్టడంతో పెర్త్ టెస్ట్‌కు అతడు దూరమయ్యాడు. అయితే రెండో టెస్ట్‌కల్లా అందుబాటులోకి వచ్చాడు. అక్కడి నుంచి టీమ్ పగ్గాలు చేపట్టాడు. కానీ ఆ మ్యాచ్‌కు ముందు హిట్‌మ్యాన్ ఓ మాట ఇచ్చాడు. పెర్త్ టెస్ట్‌లో జైస్వాల్-రాహుల్ జోడీ ఓపెనింగ్‌లో అదరగొట్టారు కాబట్టి వాళ్లను విడదీయబోనని.. ఎంత కష్టమైనా ఫర్వాలేదు తాను మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగుతానని స్పష్టం చేశాడు. రెండు, మూడో టెస్టులో దీనికి కట్టుబడిన రోహిత్.. బాక్సింగ్ డే టెస్ట్‌కు మనసు మార్చుకున్నాడు. జైస్వాల్-రాహుల్ ఓపెనింగ్‌లో సక్సెస్ అవుతున్నా వారిని మార్చేశాడు. తాను వరుసగా ఫెయిల్ అవుతుండటంతో ఓపెనర్‌గా అవతారం ఎత్తాడు.


హమీ ఇచ్చి తప్పాడు!

ఓపెనింగ్‌ జోడీని మార్చబోనని హామీ ఇచ్చి మాట తప్పాడు రోహిత్. ఒకవేళ ఆ పొజిషన్‌లో అతడు సక్సెస్ అయితే ఎవరూ విమర్శించే వారు కాదు. కానీ అది జరగలేదు. మెల్‌బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 5 బంతులే ఆడి పెవిలియన్ బాట పట్టాడు భారత సారథి. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ షాట్ అసలు ఎందుకు ఆడాడో ఎవరికీ అర్థం కాలేదు. సిరీస్ మొత్తం ఇదే తంతు. కమిన్స్ రావడం.. రోహిత్‌ను ఔట్ చేయడం పరిపాటిగా మారిపోయింది. క్రీజులో కుదురుకుందాం, పట్టుదలతో ఆడదాం, ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిద్దాం అనే కసి, చొరవ రోహిత్‌లో కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడు త్వరగా ఔట్ అవడంతో ఇతర బ్యాటర్లపై ప్రెజర్ పడుతోందని.. ఓవరాల్‌గా జట్టు వైఫల్యానికి రోహిత్ పెద్ద కారణంగా మారుతున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి. ఆకాశ్‌దీప్‌ను నైట్‌వాచ్‌మన్‌గా పంపడం, అతడు ఓపెనర్‌గా రావడం రెండూ జట్టును తీవ్రంగా దెబ్బతీసిన నిర్ణయాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read:

పంతం నెగ్గించుకున్న ఆసీస్.. 11 మంది కలసి మరీ..

వాటే షాట్ కోహ్లీ.. కడుపు నిండిపోయింది బంగారం

టీమిండియా కొంపముంచిన జైస్వాల్.. ఆసీస్ నెత్తిన పాలు

For More Sports And Telugu News

Updated Date - Dec 27 , 2024 | 04:46 PM