Share News

Sanju Samson: సంజూకు అంతుపట్టని వీక్‌నెస్.. అది దాటితే రోహిత్ రేంజ్ ఖాయం

ABN , Publish Date - Nov 16 , 2024 | 05:45 PM

Sanju Samson: టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. బ్యాటింగ్ ఇంత ఈజీనా అనేలా అతడు పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు.

Sanju Samson: సంజూకు అంతుపట్టని వీక్‌నెస్.. అది దాటితే రోహిత్ రేంజ్ ఖాయం

టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. బ్యాటింగ్ ఇంత ఈజీనా అనేలా అతడు పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు జట్టులో చోటు కోసం పోరాటే సాధారణ ఆటగాడిలా కనిపించిన సంజూ.. ఇప్పుడు తాను లేని టీమ్‌‌ను ఊహించలేని స్థితికి తీసుకెళ్లిపోయాడు. భారత జట్టు వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మను మరిపిస్తున్నాడు శాంసన్. అతడిలాగే దేనికీ భయపడకుండా ఫియర్‌లెస్ అప్రోచ్‌తో ఆడుతున్నాడు. దంచుడే పనిగా పెట్టుకొని బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. అయితే హిట్‌మ్యాన్ రేంజ్‌కు చేరుకోవాలంటే ఈ సెంచరీల హీరో ఓ అంతుపట్టని బలహీనతను అధిగమించాల్సి ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..


అంతుపట్టని వీక్‌నెస్

కొడితే సెంచరీ.. లేకపోతే సున్నా. కొన్ని ఇన్నింగ్స్‌ల నుంచి సంజూది ఇదే తీరు. పొట్టి ఫార్మాట్‌లో రోహిత్‌కు సరైన వారసుడు దొరికాడని అతడి వరుస సెంచరీలు చూసి అందరూ మురిసిపోయారు. కానీ శాంసన్ డకౌట్లు చూసి భయపడుతున్నారు. పొట్టి ఫార్మాట్‌లో అతడు ఆడిన గత కొన్ని ఇన్నింగ్స్‌లు చూస్తే ఇది అర్థమవుతుంది. గత పది ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు బాదాడీ కేరళ సెన్సేషన్. అయితే ఏకంగా నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు. మిగతా సందర్భాల్లోనూ సోసోగానే ఆడాడు. టీ20ల్లో ఒకే ఏడాది మూడు సెంచరీలు బాదిన బ్యాటర్‌గా భారత స్టార్ రేర్ ఫీట్ నమోదు చేశాడు. బంగ్లాదేశ్ మీద ఒకటి, సౌతాఫ్రికాపై రెండు శతకాలు కొట్టాడు సంజూ.


కొడితే సెంచరీ.. లేదంటే సున్నా!

హైదరాబాద్ వేదికగా బంగ్లాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 47 బంతుల్లోనే 111 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఆ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచుల్లో మాత్రం 10, 29 పరుగులే చేశాడు. అంతకుముందు శ్రీలంక టూర్‌లో మొదట్రెండు టీ20ల్లో సున్నాకే పెవిలియన్ బాట పట్టాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో సెంచరీ బాదిన సంజూ.. రెండో టీ20లో డకౌట్ అయ్యాడు. మూడో మ్యాచ్‌లోనూ అదే వరస. సున్నాకే క్రీజును వీడాడు. కానీ ఆఖరి మ్యాచ్‌లో 56 బంతుల్లో 109 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.


ఎలాగైనా అధిగమించాలి

ప్రతి మ్యాచ్‌లో సెంచరీ కొట్టడం అసాధ్యం. శతకం బాదకపోయినా మంచి స్టార్ట్ ఇస్తే బాగుంటుంది. కానీ సంజూ మాత్రం ఆడితే భారీ ఇన్నింగ్స్ లేదంటే ఆరంభంలోనే ఔటై వెళ్లిపోతుండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. బిగ్ నాక్స్‌ ఆడటంతో పాటు సున్నా చుట్టేయకుండా క్విక్ స్టార్ట్స్ అందించడం, చిన్న స్కోర్లను భారీ ఇన్నింగ్స్‌లుగా మలచడంపై ఫోకస్ చేయాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ఈ ఒక్క బలహీనత అధిగమిస్తే లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో మరో రోహిత్ కాగల సత్తా సంజూకు ఉందని కామెంట్స్ చేస్తున్నారు.


Also Read:

గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియాకు షాక్.. ఇలా రివర్స్ అయిందేంటి

బాక్సింగ్ దునియాను ఏలినోడు.. యూట్యూబర్ చేతిలో ఓడాడు

ఆ ఇద్దరి జోడీకి టీమిండియా రికార్డులు బద్దలు

For More Sports And Telugu News

Updated Date - Nov 16 , 2024 | 07:21 PM