Sanju Samson: సంజూ శాంసన్‌కు బిగ్ షాక్.. ఇక టీమిండియాలోకి నో ఎంట్రీ..
ABN , Publish Date - Dec 27 , 2024 | 08:17 PM
Team India: టీమిండియా సెన్సేషన్ సంజూ శాంసన్ వరుస సెంచరీలతో ఊపు మీదున్నాడు. భారత జెర్సీ వేసుకుంటే చాలు అతడు చెలరేగిపోతున్నాడు. ఫ్యూచర్‌పై మస్తు ఆశలు రేపుతున్నాడు. ఈ తరుణంలో అతడికి బిగ్ షాక్ తగిలింది.
టీమిండియాలో మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది సంజూ శాంసనే. ఈ డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ దాదాపు దశాబ్ద కాలం కిందే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడి తర్వాత డెబ్యూ ఇచ్చిన శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి పలువురు కుర్రాళ్లు భారత జట్టులో పర్మినెంట్ సభ్యులుగా మారారు. కానీ సంజూ ప్లేస్ మాత్రం ఊగిసలాటలోనే సాగుతూ వచ్చింది. టీమ్‌లో ఉంచుతారో, తీసేస్తారో అనేది ఎప్పుడూ అనుమానంగానే ఉండేది. అయితే ఇటీవల వరుస సెంచరీలతో తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడీ కేరళ బ్యాటర్. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో శాంసన్ జట్టులో తప్పక ఉండాల్సిందేననే ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. ఈ తరుణంలో అతడికి బిగ్ షాక్ తగిలింది.
వస్తానని చెప్పినా..
వరుస సెంచరీలతో టీమిండియాలో తన బెర్త్‌ను పర్మినెంట్ చేసుకుంటున్న సంజూకు బిగ్ షాక్ తగిలింది. ఈ స్టార్ బ్యాటర్ విషయంలో కేరళ క్రికెట్ అసోసియేషన్ తగ్గేదేలే అంటూ దూకుడుగా వ్యవహరిస్తోంది. విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ ఎంపిక చేసిన జట్టులో భారత స్టార్‌కు చోటు ఇవ్వలేదు. ఈ డొమెస్టిక్ టోర్నీ కోసం తాను అందుబాటులో ఉంటానని రెండ్రోజుల కిందే ప్రకటించాడు సంజూ. వచ్చే ఏడాది ఆరంభంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనుంది. ఈ టోర్నీలో ఆడే టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే విజయ్ హజారే ట్రోఫీలో శాంసన్ రాణించాల్సి ఉంటుంది.
తప్పు ఎవరిది?
విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించి చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని సంజూ భావించాడు. కానీ విజయ్ హజారే టోర్నీ కోసం నిర్వహించే సన్నాహక శిబిరానికి అతడ్ని ఎంపిక చేయలేదు. ఇందులో ఆడిన వారినే మెయిన్ టోర్నమెంట్‌కు తీసుకుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ శిబిరానికి రాలేనని సంజూ చెప్పడం, ఆ తర్వాత ఆడతానని సమాచారం అందించాడు. అయితే సెలెక్టర్లు మాత్రం అతడ్ని పక్కనబెట్టాలని డిసైడ్ అయ్యారని వినిపిస్తోంది. టోర్నీ ఆరంభమయ్యే నాటికి సెలెక్టర్లు-సంజూకు మధ్య ఉన్న గ్యాప్ తొలగి అతడు ఆడితే ఏ ఇబ్బందీ ఉండదు. ఒకవేళ ఆడకపోతే మాత్రం అతడికి చాంపియన్స్ ట్రోఫీ తలుపులు దాదాపుగా మూసిపోయినట్లేనని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
Also Read:
కోహ్లీని అవమానించిన ఆసీస్.. కనీస గౌరవం కూడా ఇవ్వకుండా..
కోహ్లీని కాపాడిన సచిన్ టెక్నిక్.. 20 ఏళ్ల సీన్ రిపీట్
మాట తప్పిన రోహిత్.. కెప్టెన్ అని నమ్మితే నిండా ముంచాడు..
పంతం నెగ్గించుకున్న ఆసీస్.. 11 మంది కలసి మరీ..
For More Sports And Telugu News