Share News

Sanju Samson: సంజూ శివతాండవం.. సౌతాఫ్రికా బౌలర్లకు నరకం చూపించాడు

ABN , Publish Date - Nov 08 , 2024 | 09:44 PM

మిగతా బ్యాటర్ల కంటే తాను ఎందుకంత స్పెషల్ అనేది మరోమారు ప్రూవ్ చేశాడు సంజూ శాంసన్. బ్యాటింగ్ అంటే ఇంత ఈజీనా అనిపించేలా థండర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సౌతాఫ్రికా బౌలర్లకు నరకం చూపించాడు.

Sanju Samson: సంజూ శివతాండవం.. సౌతాఫ్రికా బౌలర్లకు నరకం చూపించాడు

Sanju Samson: మిగతా బ్యాటర్ల కంటే తాను ఎందుకంత స్పెషల్ అనేది మరోమారు ప్రూవ్ చేశాడు సంజూ శాంసన్. బ్యాటింగ్ అంటే ఇంత ఈజీనా అనిపించేలా థండర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సౌతాఫ్రికా బౌలర్లకు నరకం చూపించాడు. ఆ జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మొదట్నుంచి బాదుడు మొదలుపెట్టిన ఈ స్టార్ బ్యాటర్.. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలిస్తూ పోయాడు. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడాల్లేకుండా అందర్నీ దంచికొట్టాడు. ఫోర్లు, సిక్సులతో ప్రొటీస్‌పై శివతాండవం చేశాడు. సూపర్ సెంచరీతో చెలరేగాడు.


బాదుడే బాదుడు

27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు సంజూ. ఆ తర్వాత కూడా అతడు నెమ్మదించలేదు. భారీ షాట్లు బాదుతూ పోయాడు. 47 బంతుల్లో మూడంకెల స్కోరుకు చేరుకున్నాడు. అయితే మరో ఎండ్‌లో అతడికి సహకారం కరువైంది. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (7), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (21) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. వీళ్లు ఔటైనా మరో ఎండ్‌లో సంజూ మాత్రం దూకుడు ఆపలేదు. కేశవ్ మహారాజ్, నకాబా పీటర్‌, ప్యాట్రిక్ క్రూగర్ సహా మిగతా బౌలర్లను కూడా వాయించి వదిలిపెట్టాడు. ఎంత మంది బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. స్కోరు బోర్డును బుల్లెట్ పేస్‌తో పరుగులు పెట్టిస్తున్న సంజూ ప్రస్తుతం 101 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇప్పటికే 7 బౌండరీలు, 9 భారీ సిక్సులు కొట్టిన అతడు.. ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. టీమ్ స్కోరు 14.5 ఓవర్లలో 3 వికెట్లకు 167.


Also Read:

రోహిత్ సావాసంతో అదే నేర్చుకున్నా.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

శుభవార్త చెప్పిన కేఎల్ రాహుల్ జంట.. ఖుషీలో అభిమానులు

గంభీర్‌కు రోహిత్ భయం.. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అంటే ఇదే

For More Sports And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 09:53 PM