Sarfaraz Khan: సర్ఫరాజ్ కెరీర్ క్లోజ్.. ఇంక డొమెస్టికే దిక్కు
ABN , Publish Date - Nov 03 , 2024 | 07:01 PM
Sarfaraz Khan: టీమిండియాకు మరో ఊహించని ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టెస్ట్‌లో ఓడిన భారత్.. సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. దీంతో ఓటమికి కారణాలు అన్వేషించడం మొదలైపోయింది.
IND vs NZ: టీమిండియాకు మరో ఊహించని ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టెస్ట్‌లో ఓడిన భారత్.. సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. దీంతో ఓటమికి కారణాలు అన్వేషించడం మొదలైపోయింది. ముఖ్యంగా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మీద అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. సర్ఫరాజ్‌ను టీమ్‌లో నుంచి తీసేయాలని, అతడికి బదులు ఇతర యంగ్‌స్టర్స్‌ను తీసుకోవడం బెటర్ అని అంటున్నారు. కేఎల్ రాహుల్ లాంటి సీనియర్‌ను కాదని సర్ఫరాజ్‌ను తీసుకుంటే అతడు పొడిచిందేమీ లేదని సీరియస్ అవుతున్నారు. ఇంక అతడి కెరీర్ క్లోజ్ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్లాప్‌షో
కివీస్‌తో సిరీస్‌లో తొలి టెస్ట్‌లో రాహుల్ ఫ్లాప్ అవడంతో అతడి ప్లేస్‌లో సర్ఫరాజ్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. కానీ అతడు కూడా విఫలమయ్యాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అతడి స్కోర్లు ఇలా ఉన్నాయి.. 10, 9, 0, 1. బాగా రాణించి మిడిలార్డర్‌లో తన స్థానాన్ని పదిలపర్చుకునే అవకాశం వచ్చినా సర్ఫరాజ్ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఈ నాలుగు సార్లూ స్పిన్నర్లు శాంట్నర్, అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. స్పిన్ బాగా ఆడతాడని తెచ్చుకుంటే స్పిన్నర్ల బౌలింగ్‌లోనే అతడు ఔట్ అవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ సహా ఫ్యాన్స్ కూడా కంగుతిన్నారు.
రీఎంట్రీ కష్టమే
భారత్ తదుపరి ఆస్ట్రేలియా సిరీస్‌కు వెళ్లనుంది. అయితే న్యూజిలాండ్ సిరీస్ ఓటమితో స్టార్ ప్లేయర్ల ప్లేస్‌లు కూడా అయోమయంలో పడ్డాయి. అలాంటి తరుణంలో జట్టులో ఇంకా చోటు కన్ఫర్మ్ కాని సర్ఫరాజ్‌ను కంగారూ టూర్‌కు తీసుకెళ్లడం కష్టంగానే కనిపిస్తోంది. అందునా తాజా సిరీస్‌లో దారుణంగా విఫలమవడంతో కనీసం బెంచ్ మీద కూడా అతడికి బెర్త్ కష్టంగానే ఉంది. జట్టులో చోటు కోసం ఇతర యంగ్‌స్టర్స్ నుంచి తీవ్రంగా పోటీ ఉండటంతో సర్ఫరాజ్ ఇంక టీమ్‌లోకి రావడం అసాధ్యమేనని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అతడి పనైపోయిందని.. వెళ్లి డొమెస్టిక్ ఆడుకోవాలని చెబుతున్నారు. మరి.. సర్ఫరాజ్ సింహంలా ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి తిరిగొచ్చి పంజా విసురుతాడో లేదా దేశవాళీలకే పరిమితం అవుతాడో చూడాలి.
Also Read:
ముంబై టెస్ట్‌లో భారత్ ఓటమికి 3 ప్రధాన కారణాలు
టీమిండియాకు విలన్లుగా రోహిత్-కోహ్లీ.. ఆ ఒక్క తప్పుతో..
తప్పు నాదే.. ఒప్పుకుంటున్నా: రోహిత్ శర్మ
For More Sports And Telugu News