Share News

Shubman Gill: గత ఏడాది ఆ రెండు కోరికలు తీరలేదన్న గిల్.. ఫ్యాన్స్ ఫైర్

ABN , Publish Date - Jan 01 , 2024 | 06:37 PM

Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా 2023 ఏడాది ఆరంభంలో కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. కానీ వాటిలో కొన్ని మాత్రమే సాధించానని, మరికొన్ని అందుకోలేకపోయానని గిల్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

Shubman Gill: గత ఏడాది ఆ రెండు కోరికలు తీరలేదన్న గిల్.. ఫ్యాన్స్ ఫైర్

అందరూ నూతన ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా గత ఏడాది జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా 2023 ఏడాది ఆరంభంలో కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. కానీ వాటిలో కొన్ని మాత్రమే సాధించానని, మరికొన్ని అందుకోలేకపోయానని గిల్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. వాటిలో భారత్ తరపున అత్యధిక సెంచరీలు సాధించడం, కుటుంబాన్ని ఆనందంగా ఉంచడం, సాధ్యమైనంత కష్టపడటం, ప్రపంచకప్‌ను అందుకోవడం, ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్‌ను సాధించడం అని తన పోస్టులో పేర్కొన్నాడు. వీటిలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించడం, ప్రపంచకప్ అందుకోవడం వంటి లక్ష్యాలను గిల్ అందుకోలేకపోయాడు.

గత ఏడాది టీమిండియా తరఫున అత్యధిక సెంచరీల రికార్డు కోహ్లీ పేరిట ఉన్నా.. ఆ రికార్డును గిల్ అందుకోవాలని ప్రయత్నించడం సెల్‌ఫిష్‌కు నిదర్శనమని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. ముందు అన్ని ఫార్మాట్లలో గిల్ నిలకడగా ఆడటం నేర్చుకోవాలని.. అప్పుడే రికార్డులు వాటంతట అవే వస్తాయని హితవు పలుకుతున్నారు. మరోవైపు 2023 ఏడాదిలో ఎన్నో అనుభూతులు పొందినట్లు గిల్ చెప్పాడు. కొన్ని సరదాగా అనిపిస్తే మరికొన్నింటి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు తెలిపాడు. ఊహించినట్లుగా 2023 ఏడాది గడవలేదని స్పష్టం చేశాడు. కానీ తమ లక్ష్యాలకు చాలా దగ్గరగా వచ్చామని, సాధ్యమైనంత వరకు ప్రయత్నించామని గర్వంగా చెబుతున్నానని గిల్ పేర్కొన్నాడు. కొత్త ఏడాదిలో కొన్ని సవాళ్లు, అవకాశాలు రానున్నాయని.. 2024లో తమ లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తామని భావిస్తున్నట్లు గిల్ వెల్లడించాడు. చేసే ప్రతి పనిలో అందరికీ ప్రేమ, ఆనందం, శక్తి లభిస్తుందని ఆశిస్తున్నట్లు గిల్ తన పోస్టులో చెప్పుకొచ్చాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 01 , 2024 | 06:42 PM