Rohit Sharma: ఆ తప్పు మాత్రం చేయకు.. టీమ్‌కు డేంజర్.. రోహిత్‌కు గంగూలీ సూచన
ABN , Publish Date - Nov 16 , 2024 | 09:50 PM
Rohit Sharma: భారత దిగ్గజం సౌరవ్ గంగూలీ ఏ విషయం మీదైనా నిక్కచ్చిగా మాట్లాడతాడు. అవతల ఉన్నది ఎవ్వరైనా తాను చెప్పాలని అనుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పేస్తాడు. అలాంటోడు తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కీలక సలహా ఇచ్చాడు.
భారత దిగ్గజం సౌరవ్ గంగూలీ ఏ విషయం మీదైనా నిక్కచ్చిగా మాట్లాడతాడు. అవతల ఉన్నది ఎవ్వరైనా సరే తాను చెప్పాలని అనుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పేస్తాడు. విమర్శలు చేయడంలోనూ అతడు వెనుకాడడు. అయితే అడ్డగోలుగా కాకుండా పనికొచ్చేలా సద్విమర్శలు చేస్తుంటాడు. టీమిండియా గురించి జట్టు ఆటగాళ్ల గురించి అవసరమైనప్పుడు దాదా రియాక్ట్ అవుతాడు. తాజాగా అతడు టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్.. ఆ తప్పు మాత్రం చేయకు అని సూచించాడు. అది జట్టుకు అస్సలు మంచిది కాదంటూ హెచ్చరించాడు. అసలు హిట్‌మ్యాన్‌కు దాదా ఇచ్చిన సలహా ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
ఆ బాధ్యత రోహిత్‌దే
ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి రోహిత్ పూర్తి అందుబాటులో ఉండాలని గంగూలీ అన్నాడు. హిట్‌మ్యాన్ రాకతో టీమ్‌లో ఫుల్ జోష్ వస్తందన్నాడు. ‘తొలి టెస్టు 22న మొదలవనుంది. పెర్త్ టెస్ట్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ఇది చాలా పెద్ద సిరీస్. అప్పటికల్లా రోహిత్ జట్టుతో చేరితే బాగుంటుంది. అతడో గొప్ప సారథి. ఇప్పుడు జట్టుకు అతడి అవసరం ఎంతగానో ఉంది. ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమ్‌ను ముందుండి నడిపించాల్సిన బాధ్యత రోహిత్ మీద ఉంది’ అని దాదా చెప్పుకొచ్చాడు. పెర్త్ టెస్ట్‌ను మిస్ చేసుకోవద్దని.. ఆ తప్పు చేయొద్దంటూ రోహిత్‌కు సూచించాడు.
నమ్మకాన్ని నిలబెట్టాడు
హిట్‌మ్యాన్ లేకపోతే టీమిండియాకు డేంజర్ అన్నాడు గంగూలీ. అతడి రాకతో టీమ్‌లో భారీ మార్పు వస్తుందని.. రోహిత్ అవసరం జట్టుకు ఉందన్నాడు. అన్ని ఫార్మాట్లలో ఆడటం, కెప్టెన్సీ చేయడం వల్ల అతడికి పనిభారం తీవ్రంగా పెరిగిందన్నాడు. దీన్ని ముందే గుర్తించి టెస్ట్ సారథ్యం తనకు వద్దని రోహిత్ అన్నాడని.. అయితే లాంగ్ ఫార్మాట్ కెప్టెన్సీ గొప్పతనం గురించి చెప్పి తానే ఒప్పించానన్నాడు. తన నమ్మకాన్ని రోహిత్ నిలబెట్టాడని.. టెస్టుల్లో సారథిగా ఫుల్ సక్సెస్ అయ్యాడని మెచ్చుకున్నాడు. కాగా, దాదా బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలోనే కెప్టెన్సీ పగ్గాలను విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మకు బదిలీ చేశారు. కాగా, కొడుకు పుట్టడంతో భార్య రితికా దగ్గర ఉంటున్నాడు హిట్‌మ్యాన్. అతడు తొలి టెస్ట్‌లో ఆడతాడో లేదో అనుమానంగా మారింది. అందుకే దాదా పైవ్యాఖ్యలు చేశాడు.
Also Read:
రీఎంట్రీలో అదరగొట్టిన షమీ.. బ్యాటర్లకు వెన్నులో వణుకు
సారీ చెప్పిన సంజూ.. చేయాల్సిందంతా చేసి ఆఖరికి క్షమాపణలు
టీమిండియాలో జూనియర్ యువీ.. ఇది వెంటాడి వేటాడే సింహం
For More Sports And Telugu News