Share News

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. సౌతాఫ్రికాతో టీమిండియా ఫైట్.. అయితే చిన్న మెలిక

ABN , Publish Date - Dec 29 , 2024 | 08:09 PM

WTC Final: సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రపంచ కప్ లాంటి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వచ్చే ఏడాది జూన్ నెలలో జరగనుంది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ఈ ఫైనల్ బెర్త్‌ను సౌతాఫ్రికా ఖాయం చేసుకుంది.

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. సౌతాఫ్రికాతో టీమిండియా ఫైట్.. అయితే చిన్న మెలిక
WTC Final

సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రపంచ కప్ లాంటి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వచ్చే ఏడాది జూన్ నెలలో జరగనుంది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ఈ ఫైనల్ బెర్త్‌ను సౌతాఫ్రికా ఖాయం చేసుకుంది. పాకిస్థాన్ మీద తాజా విజయంతో ఆ టీమ్ ఫైనల్‌కు గ్రాండ్‌గా దూసుకెళ్లింది. దీంతో తుదిపోరులో ప్రొటీస్‌తో తలపడే జట్టు ఏదో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రేలియాతో పాటు టీమిండియా ఫైనల్ బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. మన కంటే కంగారూ టీమ్ ఈ రేసులో కాస్త ముందంజలో ఉంది. కానీ రోహిత్ సేన కూడా పోరాడితే ఫైనల్ టికెట్ కన్ఫర్మ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అసలు భారత్ ఛాన్సులు ఎంత? మన జట్టుకు ఉన్న అడ్డంకి ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


సమీకరణాలు ఇలా..

ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆసీస్ (58.89) రెండో స్థానంలో ఉండగా.. భారత్ (55.88) థర్డ్ పొజిషన్‌లో ఉంది. ఈ రెండు జట్లలో ఒకటి పక్కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ టీమిండియా ఫైనల్ చేరాలంటే కంగారూలతో ఇప్పుడు జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1తో కైవసం చేసుకోవాలి. అదే సమయంలో శ్రీలంకతో తదుపరి జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ ఒక మ్యాచ్‌లో మాత్రమే నెగ్గాలి. ఒకవేళ ప్రస్తుత బీజీటీ సిరీస్ 2-2తో డ్రా అయినా రోహిత్ సేనకు చాన్స్ ఉంటుంది. అప్పుడు లంకతో సిరీస్‌లో కంగారూలు ఒక్క మ్యాచ్‌లోనూ గెలవకూడదు.


లంక ఏం చేస్తుందో..?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1-1తో ముగిసినా టీమిండియాకు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే చాన్స్ ఉంటుంది. అది జరగాలంటే కమిన్స్ సేనతో రెండు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకోవాలి. ఈ ఈక్వేషన్స్‌తో సంబంధం లేకుండా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే.. ఆసీస్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లోని నాలుగో టెస్టుతో పాటు సిడ్నీ వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్‌లోనూ రోహిత్ సేన తప్పనిసరిగా విజయం సాధించాలి. 3-1తో బీజీటీ ట్రోఫీని కైవసం చేసుకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ క్వాలిఫై అవుతుంది. మెల్‌బోర్న్ టెస్ట్‌లో విజయం సాధిస్తే మన జట్టుకు చాలా తలుపులు తెరుచుకుంటాయి. ఏం జరుగుతుందో చూడాలి.


Also Read:

నా ఆట నాకే నచ్చట్లేదు.. నితీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జడేజాకు క్లాస్ పీకిన రోహిత్.. పిచ్చి పట్టిందా అంటూ..

ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు.. నితీష్‌పై పవన్ రియాక్షన్

నితీష్ రెడ్డికి అరుదైన గౌరవం.. సచిన్ సరసన తెలుగోడు..

For More Sports And Telugu News

Updated Date - Dec 29 , 2024 | 08:13 PM