Share News

IPL 2024 SRH vs CSK: సీఎస్కేపై టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ABN , Publish Date - Apr 05 , 2024 | 07:08 PM

హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ సారధ్యంలోని చెన్నైకి బ్యాటింగ్ అప్పగించాడు.

IPL 2024 SRH vs CSK: సీఎస్కేపై టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ సారధ్యంలోని చెన్నైకి బ్యాటింగ్ అప్పగించాడు.

తుది జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్.

వికెట్ మంచిగా కనిపిస్తుండడంతో బౌలింగ్ ఎంచుకున్నామని సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ చెప్పాడు. మ్యాచ్ ఆసాంతం ఇలాగే ఉండాలని భావిస్తున్నామని, తమ టీమ్ చాలా బావుందని కమ్మిన్స్ అన్నాడు. మయాంక్ అగర్వాల్ అనారోగ్యంతో ఉండడంతో అతడి స్థానంలో నితీష్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. నటరాజన్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడని చెప్పాడు. గత మ్యాచ్‌లో 500 పరుగులు చేయడంతో ఈ మైదానం మంచి వికెట్‌గా కనిపిస్తోందని ప్యాట్ కమ్మిన్స్ అభిప్రాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి

IPL 2024: సన్‌రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్‌ వేళ ఉప్పల్ స్టేడియంపై అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు

IPL 2024: మరికొద్ది సేపట్లో మ్యాచ్ మొదలుకానుండగా.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Apr 05 , 2024 | 07:32 PM