Share News

Travis Head: శనిలా తగులుకున్న హెడ్.. రోహిత్‌పై ఎందుకింత పగ

ABN , Publish Date - Dec 07 , 2024 | 04:24 PM

Travis Head: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ట్రావిస్ హెడ్ వదలడం లేదు. హిట్‌మ్యాన్‌తో పాటు భారత జట్టుకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడీ ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్.

Travis Head: శనిలా తగులుకున్న హెడ్.. రోహిత్‌పై ఎందుకింత పగ

IND vs AUS: ట్రావిస్ హెడ్.. ఈ పేరు వింటేనే టీమిండియా ఫ్యాన్స్‌కు దడ పుడుతుంది. ఒకప్పుడు రికీ పాంటింగ్, కుమార సంగక్కర, జాక్వెస్ కలిస్, ఇంజమాముల్ హక్, యూనిస్ ఖాన్ లాంటి ప్లేయర్లు భారత అభిమానుల్ని భయపెట్టేవారు. కీలక మ్యాచుల్లో పరుగుల వరద పారించి మెన్ ఇన్ బ్లూ నుంచి విజయాన్ని లాక్కునేవారు. ఇప్పుడు హెడ్ కూడా అలాగే తయారయ్యాడు. బడా మ్యాచుల్లో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను బయటకు తీయడం ఈ కంగారూ ఓపెనర్‌కు అలవాటు. ముఖ్యంగా టీమిండియాతో మ్యాచ్ అంటే చాలు.. అతడు విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అదే కంటిన్యూ అవుతోంది.


ఎందుకింత పగ?

పెర్త్ టెస్ట్‌లో హాఫ్ సెంచరీ బాదిన ట్రావిస్ హెడ్.. బిగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అంత చిత్తుగా ఓడటానికి అతడి ఫెయిల్యూర్ కూడా ఓ కారణమనే చెప్పాలి. అయితే ఆ మ్యాచ్‌లో విఫలమైనా రెండో టెస్టులో మాత్రం సెంచరీతో చెలరేగాడు. అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో 141 బంతుల్లో 140 పరుగులతో అదరగొట్టాడీ కంగారూ బ్యాటర్. వార్ వన్‌సైడ్ అవుతుందనుకుంటే హెడ్ సెంచరీతో మ్యాచ్ పూర్తిగా ఆసీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే హెడ్ సెంచరీతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అవుతున్నారు. హిట్‌మ్యాన్‌ను కంగారూ ఓపెనర్ ఇలా తగులుకున్నాడేంటి అని ఫీల్ అవుతున్నారు.


టార్గెట్ చేసి మరీ..

పెర్త్ టెస్ట్‌లో రోహిత్ ఆడలేదు. అయితే ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సమయానికి ఆస్ట్రేలియా గడ్డపై వాలిపోయాడు హిట్‌మ్యాన్. ఆ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 11 పరుగులు మాత్రమే చేసిన హెడ్.. రోహిత్ రాక తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో అదరగొట్టాడు. 101 బంతుల్లో 89 పరుగులతో ఆకట్టుకున్నాడు. హిట్‌మ్యాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అడిలైడ్ టెస్ట్‌లో భారీ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. దీంతో రోహిత్‌ను చూస్తే హెడ్ చెలరేగుతున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. వన్డే వరల్డ్ కప్-2023 దగ్గర నుంచి ఐపీఎల్ వరకు, అలాగే ఇప్పుడు బీజీటీలోనూ రోహిత్ టీమ్‌ను టార్గెట్ చేసుకొని హెడ్ పరుగుల వర్షం కురిపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇవి చూసిన హిట్‌మ్యాన్ అభిమానులు తమ హీరోను హెడ్ ఇలా తగులుకున్నాడేంటని ఫీల్ అవుతున్నారు. రోహిత్‌పై అతడికి ఎందుకింత పగ అని ప్రశ్నిస్తున్నారు.


Also Read:

అంపైర్‌తో గొడవకు దిగిన కోహ్లీ.. ప్రూఫ్స్ చూపించి మరీ..

ఆస్ట్రేలియాకు కోహ్లీ వార్నింగ్.. రా చూస్కుందామంటూ..

సెంచరీ తర్వాత హెడ్ విచిత్రమైన సెలబ్రేషన్.. ఎందుకిలా చేశాడంటే..

For More Sports And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 04:31 PM