Share News

Virat Kohli: వాటే షాట్ కోహ్లీ.. కడుపు నిండిపోయింది బంగారం

ABN , Publish Date - Dec 27 , 2024 | 03:00 PM

Boxing Day Test: కవర్ డ్రైవ్.. క్రికెట్‌లో అత్యంత క్లిష్టమైన షాట్లలో ఒకటి. తోపు క్రికెటర్లు కూడా తడబడే షాట్ ఇది. సచిన్ టెండూల్కర్ లాంటి కొందరు దిగ్గజాలు మాత్రమే గొప్పగా ఆడే షాట్. దాన్ని మోడర్న్ గ్రేట్ విరాట్ కోహ్లీ అంతే బ్యూటిఫుల్‌గా ఆడాడు.

Virat Kohli: వాటే షాట్ కోహ్లీ.. కడుపు నిండిపోయింది బంగారం
Virat Kohli

IND vs AUS: కవర్ డ్రైవ్.. క్రికెట్‌లో అత్యంత క్లిష్టమైన షాట్లలో ఒకటి. తోపు క్రికెటర్లు కూడా తడబడే షాట్ ఇది. సచిన్ టెండూల్కర్ లాంటి కొందరు దిగ్గజాలు మాత్రమే గొప్పగా ఆడే షాట్. కవర్ డ్రైవ్ అంటే ఆషామాషీ కాదు. బంతి వేగం, స్వింగ్, లెంగ్త్‌, గాలిలో దాని దశను పర్ఫెక్ట్‌గా అంచనా వేసి ఆడాల్సి ఉంటుంది. బ్యాట్‌తో పాటు శరీరాన్ని బంతికి దగ్గరగా తీసుకెళ్లి ఫీల్డర్ల మధ్య సందులో నుంచి బౌండరీ లైన్ దాటించాలి. బంతిని బాదేటప్పుడు బ్యాట్, బాడీ సమతూకంతో ఉండాలి. బ్యాట్ అండ్ ఐ కో-ఆర్డినేషన్, పోస్టర్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇవన్నీ కుదిరితే కవర్ డ్రైవ్ క్లాసిక్‌గా మారుతుంది. ఈ షాట్ కొట్టడంలో తనకు ఉన్న టాలెంట్‌ను మరోమారు ప్రూవ్ చేశాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. బాక్సింగ్ డే టెస్ట్‌లో స్టన్నింగ్ కవర్‌డ్రైవ్‌తో అందర్నీ మెస్మరైజ్ చేశాడు.


వాటే టైమింగ్..

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఓవర్‌లో కోహ్లీ బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్ బాదాడు. బంతి పడిన వెంటనే తన శరీరాన్ని కాస్త ముందుకు వంచి దానికి చేరువగా తీసుకెళ్లాడు. బాల్‌ను నిశితంగా గమనిస్తూ పర్ఫెక్ట్ టైమింగ్‌తో ఫోర్‌గా మలిచాడు. ఆ సమయంలో బంతి మీద అతడి ఫోకస్, టెక్నిక్, బాడీ బ్యాలెన్స్ హైలైట్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో ఈ షాట్‌తో పాటు మరో మూడ్నాలుగు మంచి షాట్లు ఆడాడు విరాట్. అయితే ఈ కవర్ డ్రైవ్ ఇన్నింగ్స్‌కు హైలైట్‌గా నిలిచింది. ఇది చూసిన నెటిజన్స్ వాటే షాట్.. కడుపు నిండిపోయింది బంగారం అంటూ కింగ్‌ను మెచ్చుకుంటున్నారు.


వింటేజ్ విరాట్‌లా..

కవర్ డ్రైవ్ అంటే ఇదీ.. ఇలాగే కొట్టాలి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారిగా వింటేజ్ విరాట్‌ను గుర్తుచేశాడని ప్రశంసిస్తున్నారు. కెరీర్ పీక్ ఫామ్‌లో ఉన్న సమయంలో ఆఫ్ సైడ్ పడిన బంతుల్ని అతడు కవర్ డ్రైవ్‌లుగా మలిచే తీరు గుర్తుకొస్తోందని అభిమానులు అంటున్నారు. అయితే మెల్‌బోర్న్ టెస్ట్‌లో విరాట్ 36 పరుగులు చేసి ఔట్ అవడం నిరాశపర్చిందని చెబుతున్నారు. బిగ్ నాక్‌కు అంతా రెడీ అనుకున్న టైమ్‌లో బోలాండ్‌కు వికెట్ సమర్పించుకున్నాడని.. అప్పటిదాకా పడిన కష్టం అంతా బూడిదలో వేసిన పన్నీరులా మారిందని కామెంట్స్ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ ఫుల్ ఫామ్‌ను చూస్తామని ఆశిస్తున్నారు.


Also Read:

నల్ల బ్యాండ్లతో బరిలోకి భారత ప్లేయర్లు.. ఎందుకు ధరించారంటే..

టీమిండియా కొంపముంచిన జైస్వాల్.. ఆసీస్ నెత్తిన పాలు పోశాడు

సెమీస్‌లో యూపీ, పట్నా

For More Sports And Telugu News

Updated Date - Dec 27 , 2024 | 03:00 PM