Share News

Virat Kohli: ఆసీస్ బ్యాటర్లను ఆడుకున్న కోహ్లీ.. ఇదీ స్లెడ్జింగ్ అంటే..

ABN , Publish Date - Dec 06 , 2024 | 07:50 PM

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటున్నాడు. ఈ మధ్య కూల్‌గా, కామ్‌గా ఉంటున్నాడు. అలాంటోడు ఒక్కసారిగా అగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు.

Virat Kohli: ఆసీస్ బ్యాటర్లను ఆడుకున్న కోహ్లీ.. ఇదీ స్లెడ్జింగ్ అంటే..

IND vs AUS: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటున్నాడు. ఈ మధ్య కూల్‌గా, కామ్‌గా ఉంటున్నాడు. అప్పట్లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోహ్లీలో అగ్రెషన్ ఎక్కువగా కనిపించేది. ఎవరైనా రెచ్చగొడితే చాలు.. విరాట్ అగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్లిపోయేవాడు. అవతలి జట్టు ఆటగాళ్లకు బ్యాట్‌తో పాటు నోటితోనూ సమాధానం ఇచ్చేవాడు. తనను పదే పదే గెలికిన వారిని ఫీల్డింగ్‌ టైమ్‌లో స్లెడ్జ్ చేసేవాడు. అయితే ఈ మధ్య కూల్‌గా ఉంటున్నాడు కింగ్. అన్నింటికీ దూరంగా తన ఆటేదో తాను ఆడుకుంటున్నాడు. అలాంటోడు ఒక్కసారిగా అగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు.


లబుషేన్‌తో ఆటాడుకున్నాడు

అడిలైడ్ టెస్ట్‌ తొలి రోజు వింత ఘటనలు జరిగాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా తమలోని అగ్రెషన్ చూపించారు. వీరికి కోహ్లీ కూడా తోడయ్యాడు. అందరూ ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను టార్గెట్ చేసుకొని స్లెడ్జింగ్‌కు దిగారు. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో బుమ్రా వరుసగా డాట్ బాల్స్ వేస్తూ అతడ్ని అసహనానికి గురిచేశాడు. ఆ డెలివరీస్‌ను కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు లబుషేన్. దీంతో సమీపంలో ఉన్న కోహ్లీ.. అతడికి ఏమీ అర్థం కావడం లేదన్నాడు. లబుషేన్ పనైపోయిందని, ఎలా ఆడాలో అతడికి క్లారిటీ లేదంటూ రెచ్చగొట్టాడు.


టార్గెట్ చేసి మరీ..

బంతిని ఎలా ఆడాలో లబుషేన్‌కు తెలియదని, అతడికి ఏమీ అర్థం కావడం లేదన్నాడు కోహ్లీ. ఇలాగే బౌలింగ్ చెయ్.. మరో వికెట్ వస్తుందంటూ బుమ్రాను ఎంకరేజ్ చేశాడు కింగ్. నీ పనైపోయిందంటూ లబుషేన్‌కు వినబడేలా కామెంట్ చేశాడు. ఒకవైపు ఎలా ఆడతావో చూస్తానంటూ బుమ్రా అనడం, మరోవైపు కోహ్లీ కూడా స్లెడ్జ్ చేయడంతో లబుషేన్‌కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఏం చేస్తారు అన్నట్లు అతడు సీరియస్ లుక్ ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి సైట్ స్క్రీన్ ప్రాబ్లమ్ వల్ల బౌలింగ్ చేస్తున్న సిరాజ్‌ను మధ్యలో ఆపేశాడు లబుషేన్. దీంతో అతడు కంగారూ బ్యాటర్‌ వైపు కోపంగా బంతి విసిరాడు. అలా మొదటి రోజు ఆటలో లబుషేన్ బాగా హైలైట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 180 పరుగులకు కుప్పకూలింది. డే 1 ముగిసేసరికి ఆసీస్ వికెట్ నష్టానికి 86 పరుగులతో ఉంది. మెక్‌స్వీనీ (38 నాటౌట్)తో పాటు లబుషేన్ (20 నాటౌట్) కూడా క్రీజులో ఉన్నాడు.


Also Read:

బుమ్రా క్రేజీ రికార్డ్.. ఇంకో ఐసీసీ అవార్డ్ లోడింగ్..

లబుషేన్-సిరాజ్ ఫైట్.. కంగారూ బ్యాటర్‌‌పై మియా సీరియస్

U19 Asia Cup 2024: 13 ఏళ్ల వైభవ్ బ్యాటింగ్ విధ్వంసం.. ఫైనల్స్‌కు టీమిండియా

For More Sports And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 07:53 PM