IND vs AUS: భారత్‌ను రెచ్చగొడుతున్న ఆసీస్.. ఓవరాక్షన్ చేస్తే వాయించి వదులుతారు
ABN , Publish Date - Nov 13 , 2024 | 03:04 PM
IND vs AUS: ఆస్ట్రేలియా తన అసలు రంగు చూపించడం మొదలుపెట్టింది. టీమిండియాను రెచ్చగొట్టడం స్టార్ట్ చేసింది. అయితే ఓవరాక్షన్ చేస్తే గతంలోలాగే వాయించి వదులుతారని గ్రహించడం లేదు.
క్రికెట్‌లో అత్యంత కఠినమైన ఫార్మాట్‌గా టెస్టులను చెబుతుంటారు. ఆటగాళ్ల ప్రతిభ, సామర్థ్యానికి రియల్ టెస్ట్ పెట్టే ఈ ఫార్మాట్ ఆడటం అంత ఈజీ కాదు. అందునా ప్రత్యర్థిని మాటలతో కవ్విస్తూ, చేతలతో రెచ్చగొట్టే ఆస్ట్రేలియా లాంటి టీమ్ ఎదురుగా ఉంటే ప్రెజర్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. మ్యాచులు కంగారూ గడ్డ మీద జరిగితే అక్కడి ఆడియెన్స్ గోలకు ఆటగాళ్లు గ్రౌండ్‌లోకి అడుగు పెట్టాలంటేనే వణుకుతారు. దీనికి తోడు ఆసీస్ మాజీలు సిరీస్‌కు ముందే మైండ్ గేట్ స్టార్ట్ చేసేస్తారు. అడ్డగోలు వ్యాఖ్యలతో అవతలి జట్టు ప్లేయర్లను భయపెడతారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం తమ దేశానికి విచ్చేసిన భారత క్రికెటర్లను ఆసీస్ మాజీలు టార్గెట్ చేస్తున్నారు.
రోహిత్ కోసం అంతా రెడీ
విరాట్ కోహ్లీ మునుపటిలా ఆడట్లేదని, అతడిలో పస తగ్గిందని ఆసీస్ మాజీ క్రికెటర్ కెర్రీ ఓకీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు మా బౌలర్లు భీకరమైన బంతులతో ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఆసీస్ గడ్డ మీదకు అడుగు పెట్టగానే అక్కడి మీడియా వాళ్లను ప్రశంసిస్తూ, ఆకాశానికెత్తేస్తూ పలు ఆర్టికల్స్ రాసింది. దీంతో ఆసీస్ మారిపోయిందని అంతా అనుకున్నారు. వాళ్ల నుంచి మన జట్టుకు ఫుల్ సపోర్ట్ ఉంటుందని, ఎక్కడా వ్యతిరేకత ఎదురవదని భావించారు. కానీ వాళ్ల అసలు రంగు ఇప్పుడు బయటపడింది.
కోహ్లీని గిల్లడం ఖాయం
కోహ్లీ చాన్నాళ్లుగా ఆసీస్‌ను ఇబ్బంది పెడుతూ వచ్చాడని.. కానీ ఈసారి అతడి పప్పులు ఉడకడం కష్టమేనని ఓకీఫ్ చెప్పాడు. విరాట్ అప్పటి రేంజ్‌లో ఆడట్లేదని.. అతడి బ్యాటింగ్ బలహీనంగా మారిందన్నాడు. అందుకే అతడ్ని మరింత గిల్లేందుకు ప్రయత్నిస్తారన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలు విన్న భారత ఫ్యాన్స్ రోకో జోడీని అనవసరంగా రెచ్చగొడుతున్నారని అంటున్నారు. వాళ్లు దీన్ని సీరియస్‌గా తీసుకుంటే వాయించి వదులుతారని హెచ్చరిస్తున్నారు. ఆసీస్‌కు ఇక దబిడిదిబిడేనని చెబుతున్నారు. వాళ్లు ఫామ్ అందుకుంటే అంతా తారుమారు అవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు.
Also Read:
టీమిండియాకు విలన్‌గా బీసీసీఐ.. చేజేతులా ఓడిస్తున్నారు
నేను అడుక్కునే రకం కాదు: రాహుల్
హాకీ అమ్మాయిల రెండో గెలుపు
For More Sports And Telugu News