IND vs AUS: మ్యాచ్ పోయినా రివేంజ్ కంప్లీట్.. స్లెడ్జింగ్‌కు భయపడేలా చేశాడుగా..
ABN , Publish Date - Dec 31 , 2024 | 05:49 PM
BGT 2024: బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ ఎంత పోరాడినా మ్యాచ్‌ను డ్రా చేయలేకపోయింది. ఇంకో గంట సేపు పోరాడి ఆడి ఉంటే టీమిండియా సేఫ్ అయ్యేది. కానీ బ్యాటర్ల పొరపాటు, కంగారూల పట్టుదల రిజల్ట్ తారుమారు చేశాయి.
బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ ఎంత పోరాడినా మ్యాచ్‌ను డ్రా చేయలేకపోయింది. ఇంకో గంట సేపు పోరాడి ఆడి ఉంటే టీమిండియా సేఫ్ అయ్యేది. కానీ బ్యాటర్ల పొరపాటు, కంగారూల పట్టుదల రిజల్ట్ తారుమారు చేశాయి. కెప్టెన్ రోహిత్ శర్మ (9), కేఎల్ రాహుల్ (0), విరాట్ కోహ్లీ (5), రవీంద్ర జడేజా (2) ఫెయిల్యూర్ జట్టును తీవ్రంగా నష్టపరిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (208 బంతుల్లో 84), రిషబ్ పంత్ (104 బంతుల్లో 30) మాత్రం టీమ్ కోసం క్రీజులో పాతుకుపోయారు. ఆఖరి వరకు ఫైట్ చేశారు. అయితే వాళ్లిద్దరి ఔట్‌తో మ్యాచ్ మన నుంచి చేజారింది. అయితే మ్యాచ్ పోయినా కంగారూల మీద రివేంజ్ మాత్రం కంప్లీట్ అయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
మాటల యుద్ధం
స్లెడ్జింగ్ అంటే ఆస్ట్రేలియాకు పండుగ. అది వాళ్లకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఏ జట్టు ఆసీస్ పర్యటనకు వచ్చినా బూతులు, తిట్లతో అవమానించేందుకు, అవతలి జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కంగారూలు ప్రయత్నిస్తుంటారు. ఈ సిరీస్‌లోనూ వాళ్లు అదే కొనసాగిస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ దానికి బ్రేకులు వేస్తున్నారు టీమిండియా ప్లేయర్లు. ఆసీస్ ఆటగాళ్లు ఒకటి అంటే మనోళ్లు పది అంటున్నారు. మాటల యుద్ధానికి సై అంటూ కంగారూలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇదే క్రమంలో తనను స్లెడ్జ్ చేసిన ఆసీస్‌కు పోయించాడు జైస్వాల్. శామ్ కోన్స్టాస్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీకి అతడు ఇచ్చిపడేశాడు.
ఎందుకు ఓవరాక్షన్?
మెల్‌బోర్న్ టెస్ట్ ఆఖరి రోజు భారత్ డ్రా కోసం పోరాడుతోంది. 33 పరుగులకే రోహిత్, కోహ్లీ, రాహుల్ ఔట్ అయినా.. పంత్‌తో కలసి భారత్ ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు జైస్వాల్. ఫస్ట్ ఓవర్‌లో వచ్చినోడు 70వ ఓవర్ వరకు క్రీజులో పాతుకుపోయాడు. అతడు ఎంతకీ ఔట్ కాకపోవడంతో మ్యాచ్ పోతుందని భావించిన ఆసీస్ ఆటగాళ్లు అతడ్ని టార్గెట్ చేసి స్లెడ్జింగ్‌కు దిగారు. కొత్త కుర్రాడు కోన్స్టాస్ అతడ్ని స్లెడ్జ్ చేస్తూ పదే పదే ఇబ్బంది పెట్టాడు. ఇతర కంగారూ ప్లేయర్లు కూడా అదే పనిగా జైస్వాల్‌ను టార్గెట్ చేసుకున్నారు. దీంతో భారత ఓపెనర్ కోపం పట్టలేకపోయాడు. ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావ్ అంటూ కోన్స్టాస్‌కు ఇచ్చిపడేశాడు జైస్వాల్. అతడ్ని తిడుతూ వేలు చూపించాడు. దీంతో స్మిత్ కలుగజేసుకోగా.. బ్యాటింగ్ మధ్యలో అతడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటూ సీనియర్ క్రికెటర్ మీదా ఫైర్ అయ్యాడు. ఇలాగే కొనసాగితే జైస్వాల్ అతడ్ని కొట్టేలాగే కనిపించాడు. ఆ తర్వాత లయన్ బౌలింగ్‌లో బాల్‌ను కొట్టగా.. అది వెళ్లి ఆసీస్ ప్లేయర్‌కు గట్టిగా తగిలింది. జైస్వాల్ దెబ్బకు కంగారూ ఆటగాళ్లు మళ్లీ నోరెత్తలేదు. అతడు ఔటై వెళ్లిపోతుంటే హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు.
Also Read:
టీమిండియాను అవమానించిన ఆసీస్.. గెలిచామని ఇంత పొగరా..
అభిషేక్ శర్మ ఊర మాస్ బ్యాటింగ్.. టార్గెట్ చేసి మరీ చితకబాదాడు
‘అప్పుడే..నవతరం నాయకులు’
నిద్రలేని రాత్రులు.. కఠిన సవాళ్లు
For More Sports And Telugu News