IND vs AUS: భారీ ఎదురుదెబ్బ.. కీలక వికెట్ సమర్పించుకున్న టీమిండియా
ABN , Publish Date - Dec 06 , 2024 | 10:50 AM
తొలి టెస్టులో గెలిచిన టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని రెండో టెస్టులో తొలి రౌండ్ లోనే ఆసిస్ ఆటగాళ్లు నీరుగార్చారు. కీలక వికెట్ ను పడగొట్టి పండగ చేసుకున్నారు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రెండో టెస్టులో తొలి బంతికే భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్ ను మిచెల్ స్టార్క్ టార్గెట్ చేసి ఆస్ట్రేలియాకు భారీ వికెట్ ను అందించాడు. సున్నా పరుగుల వద్దే మిచెల్ చేతిలో యశస్వి అవుటయ్యాడు. దీంతో ప్రస్తుతం ఇండియా స్కోరు 0/1గా ఉంది. వన్ డౌన్ లో ఉన్న క్రీజులో ప్రస్తుతం కేఎల్ రాహల్ తో పాటు శుభ్ మన్ గిల్ ఉన్నాడు. భారత్ కు శుభారంభం అందించేందుకు వీరిద్దరూ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పే అవకాశం ఉంది. మరోవైపు ఆస్ట్రేలియన్ బౌలర్లు పైచేయి సాధించడానికి మరిన్ని వికెట్లపై కన్నేశారు.
ఓపెనింగ్ గేమ్‌కు దూరంగా ఉన్న రోహిత్ తిరిగి జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అతడితో పాటు శుభ్‌మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్‌లను కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చుకున్నాడు. ధృవ్ జురెల్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఈ ముగ్గురూ వచ్చారు. మరోవైపు, జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో పేసర్ స్కాట్ బోలాండ్‌ను ఎంపిక చేయడంతో ఆస్ట్రేలియా తమ జట్టులో ఒకే ఒక్క మార్పు చేసింది.