IPL 2024: ఐపీఎల్ 2024లో గెలిచిన.. ఓడిన జట్లకు ఎంత మనీ వస్తుంది..?
ABN , Publish Date - May 26 , 2024 | 05:37 PM
ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రికెట్ లీగ్ ఐపీఎల్. 2008లో ప్రారంభమైన ఐపీఎల్(IPL 2024) ఈసారి 17వ సీజన్ లీగ్ జరుగుతోంది. నేటి ఫైనల్ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన, ఓడిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రికెట్ లీగ్ ఐపీఎల్. 2008లో ప్రారంభమైన ఐపీఎల్(IPL 2024) ఈసారి 17వ సీజన్ లీగ్ జరుగుతోంది. నేటి ఫైనల్ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీంతోపాటు మూడు, నాల్గవ స్థానంలో నిలిచిన జట్లకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోల్ కతా నైట్ రైడర్స్(KKR), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆడే వివిధ టీ20 లీగ్‌లలో ఇదే అత్యధిక ప్రైజ్ మనీ కావడం విశేషం. అదే సమయంలో ఫైనల్‌లో ఓడిన జట్టుకు రూ.12.5 కోట్లు ఇవ్వనున్నారు. అంతేకాదు IPL 2024లో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్లకు కూడా రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు ఇవ్వనున్నారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఈ మొత్తం లభించనుంది.
అయితే ఐపీఎల్(IPL) తొలి సీజన్‌లో ఫైనల్ గెలిచిన జట్టుకు రూ.4.8 కోట్లు వచ్చాయి. ఈ ప్రైజ్ మనీ ఇప్పుడు దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. గతేడాది టైటిల్ విన్నింగ్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు రూ.20 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది కూడా ప్రైజ్‌మనీ అలాగే ఉంది. ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ ముందున్నాడు. 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులు చేశాడు. దీంతో కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ ద్వారా రూ.15 లక్షలు దక్కనున్నాయి.
ఇది కూడా చదవండి:
Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.
Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్
Read Latest Business News and Telugu News