Hyderabad: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. టికెట్ల బ్లాక్ దందాపై ఆందోళనలు
ABN , Publish Date - Apr 26 , 2024 | 09:40 AM
క్రికెట్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ యువజన సంఘాలు ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) ఎదుట ఆందోళనకు దిగాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి.. కార్యకర్తలతో గురువారం స్టేడియం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
హైదరాబాద్: క్రికెట్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ యువజన సంఘాలు ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) ఎదుట ఆందోళనకు దిగాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి.. కార్యకర్తలతో గురువారం స్టేడియం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌రావు టికెట్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఇదికూడా చదవండి: Tamilisai: మైనార్టీలకు మోదీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు..
టికెట్ల దందాతోపాటు క్రికెట్ అభిమానులు స్టేడియంలో ఆహార పదార్థాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదని డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్ రాష్ట్ర కమిటీ నేతలు స్టేడియం ముట్టడికి పిలుపునిచ్చారు. ఉప్పల్ పోలీసులకు యువజన సంఘాల నేతలు హెచ్‌సీఐపై పిర్యాదు చేశారు. మ్యాచ్‌ల్లో బ్లాక్ టికెట్ల దందాను అరికట్టాలని డీవైఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావిద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదికూడా చదవండి: IPL 2024: నేడు KKR vs PBKS మ్యాచ్..విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే
Read Latest National News and Telugu News