Share News

India vs Australia: భారత్ vs ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్టులో భారత్ బ్యాటింగ్.. కీలక ఆటగాళ్లు లేకుండానే..

ABN , Publish Date - Nov 22 , 2024 | 07:55 AM

నేటి నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మొదలైన మొదటి మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచుకు కీలక ఆటగాళ్లు మిస్ అయ్యారు.

India vs Australia: భారత్ vs ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్టులో భారత్ బ్యాటింగ్.. కీలక ఆటగాళ్లు లేకుండానే..
India vs Australia

భారత్(India), ఆస్ట్రేలియా(Australia) మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా మొదలైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇదే తొలి మ్యాచ్‌. ఈ మ్యాచ్ పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ మైదానంలో కాకుండా ఆప్టస్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ టెస్టులో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పెర్త్ టెస్టులో నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా కొత్తగా అరంగేట్రం చేశారు. దీంతో పాటు స్పిన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్‌తో టీమ్ ఇండియా వచ్చింది. దీంతో టీమిండియా రోహిత్ శర్మ, అశ్విన్, జడేజా లేకుండానే మొదట బ్యాటింగ్ చేస్తోంది.


ఇరు జట్లు

టీమ్ ఇండియా ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (WK), ధృవ్ జురెల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (c), మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్), పాట్ కమిన్స్ (సి), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్.


బుమ్రా కెప్టెన్సీ రెండో టెస్టు

పెర్త్‌లోని కొత్తగా నిర్మించిన ఆప్టస్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ మొదలైంది. ఇంతకుముందు ఈ మైదానంలో 4 మ్యాచ్‌లు జరిగాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇరు దేశాల మధ్య ఇదే తొలి మ్యాచ్. 1992 తర్వాత తొలిసారిగా భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది.

ఇంతకుముందు

బుమ్రా భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న రెండో టెస్టు ఇది. ఈ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇంతకుముందు 2018 పర్యటనలో రెండు జట్లు ఇక్కడ మొదటిసారి తలపడ్డాయి. అప్పుడు ఆతిథ్య ఆస్ట్రేలియా గెలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇక్కడ మరో 3 టెస్టులు ఆడి అందులోనూ విజయం సాధించింది.


ఆ ఆటగాళ్లు లేకపోవడం

ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ అందుబాటులో లేడు. అయితే దీని తర్వాత శుభ్‌మన్ గిల్ కూడా గాయపడడం భారత జట్టుకు ఆందోళనను పెంచింది. కొద్ది రోజుల క్రితం ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో గిల్ గాయపడటంతో అతను ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. గిల్ స్థానంలో దేవదత్ పడిక్కల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయగలడని భావించి తీసుకున్నారు.

రోహిత్ గైర్హాజరీలో, యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కానీ జైస్వాల్ మొదటి ఓవర్‌లో పరుగులు తీయకుండానే ఔట్ అయ్యాడు. మరోవైపు ఇటీవలే ఆస్ట్రేలియా ఏతో జరిగిన అనధికారిక టెస్టులో రాహుల్ ఓపెనింగ్ చేశాడు. రాహుల్ కూడా భారత్ ఏ తరఫున అద్భుతంగా రాణించలేకపోయాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులు మాత్రమే చేశాడు. మరి ఈ మ్యాచులో ఎలా రాణిస్తాడో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి:

Virender Sehwag: సెహ్వాగ్ కొడుకు డబుల్ సెంచరీ.. వామ్మో.. తండ్రిని మించిన విధ్వంసం


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Nov 22 , 2024 | 08:11 AM