Suryakumar Yadav: అక్టోబర్ 6 నుంచి భారత్, బంగ్లాదేశ్ టీ20.. అరుదైన ఫీట్ చేరువలో సూర్యకుమార్ యాదవ్..
ABN , Publish Date - Oct 04 , 2024 | 07:06 PM
మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ అక్టోబర్ 6 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య గ్వాలియర్‌లో జరగనుంది. అయితే ఈ మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను సాధించే ఛాన్స్ ఉంది. ఆ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇటివల జరిగిన భారత్, బంగ్లా(India vs Bangladesh) టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా, ఇప్పుడు T20 సిరీస్‌పై కన్నేసింది. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ అక్టోబర్ 6న గ్వాలియర్‌లో మొదలుకానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) అరుదైన ఘనతను సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించనున్నాడని క్రీడా వర్గాలు అంటున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
అరుదైన ఘనత
ఈ మ్యాచ్‌లో టీ20 ఇంటర్నేషనల్‌లో పరుగుల పరంగా షోయబ్ మాలిక్‌ను సూర్యకుమార్ యాదవ్ అధిగమించే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ 71 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 2,432 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు సాధించాడు. కాగా షోయబ్ మాలిక్ టీ20 ఇంటర్నేషనల్‌లో 124 మ్యాచ్‌లు ఆడి 2435 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ మరో 4 పరుగులు చేస్తే షోయబ్ మాలిక్ పరుగుల రికార్డును అధిగమించనున్నాడు. అంతేకాదు టీ20 ఇంటర్నేషనల్‌లో పరుగుల పరంగా కూడా డేవిడ్ మిలన్‌ను బీట్ చేయనున్నాడు. డేవిడ్ మిల్లర్ ఇప్పటివరకు 125 మ్యాచ్‌లు ఆడి టీ20 ఇంటర్నేషనల్‌లో 2437 పరుగులు చేశాడు. ఇతన్ని అధిగమించాలంటే సూర్యకుమార్ యాదవ్ 6 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది.
కెప్టెన్సీలో రికార్డు
సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం 10 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఇందులో 7 మ్యాచ్‌లు గెలిచాడు. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో ఒక మ్యాచ్ టై అయింది. ఇక భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల గత రికార్డు గురించి మాట్లాడుకుంటే ఇరు దేశాల మధ్య 14 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమ్ ఇండియా 13 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్‌లో భారత్ ఓడింది. ఇక జరగబోయే టీ20 సిరీస్‌లో టెస్టు మ్యాచ్‌లో ఓటమిపాలైన బంగ్లాదేశ్ ఈసారి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అంతేకాదు భారత్ కూడా ఈ టీ20 గెలవాలని భావిస్తోంది.
రెయిన్ ఉందా
మరోవైపు ఇటివల టెస్ట్ సిరీస్ సందర్భంగా వరణుడు రెండు, మూడు రోజులు ఆటకు ఆటంకం కలిగించాడు. ఈ క్రమంలో ఈసారి కూడా వరణుడు ఇబ్బంది పెడతాడా అంటే అక్టోబర్ 6న గ్వాలియర్‌లో వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉందని వెదర్ అంచనాలు చెబుతున్నాయి. ఒక వేళ ఆకస్మాత్తుగా వెదర్ మారితే తప్ప వర్షం కురుస్తుందని చెప్పలేం.
ఇవి కూడా చదవండి:
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Loans: గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్
Read More Sports News and Latest Telugu News