IND vs BAN: భారత్ vs బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్.. 34 పరుగులకే ముగ్గురు ఔట్..
ABN , Publish Date - Sep 19 , 2024 | 11:07 AM
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నేటి నుంచి ప్రారంభమైంది. చాలా గ్యాప్ తర్వాత భారత జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ ఇటీవలే పాకిస్థాన్‌ను టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్ చేసింది.
టీమిండియా(Team india), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో మొదలైంది. ఈ మ్యాచ్‌లో విజిటింగ్ బంగ్లాదేశ్ టీమ్ కెప్టెన్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ ఆరో ఓవర్ తొలి బంతికే భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ 6 పరుగుల వద్ద హసన్ మహమూద్‌కు ఔటయ్యాడు. నజ్ముల్ హుస్సేన్ సింపుల్ క్యాచ్ పట్టాడు. అప్పటికి భారత్ స్కోరు 14 పరుగులు. ఆ తర్వాత వచ్చిన శుభ్‌మన్ గిల్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. హసన్ మహమూద్ ఈయనను కూడా ఔట్ చేశాడు.
ముగ్గురు
రోహిత్, శుభ్‌మన్ గిల్ తర్వాత విరాట్ కోహ్లీ కూడా బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ చేతిలో ఔటయ్యాడు. విరాట్ కోహ్లి కేవలం ఆరు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేశాడు. అప్పటికీ టీమ్ ఇండియా స్కోరు 34/3. దీంతో భారత జోడీ ఇప్పటి వరకు బౌలర్లను చాలా జాగ్రత్తగా ఎదుర్కొంటోంది. తొలి మూడు వికెట్ల తర్వాత ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(28), రిషబ్ పంత్(19) పరుగులతో ఉన్నారు. 17 ఓవర్ల సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.
గతంలో
ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 13 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా, అందులో భారత్ 11 మ్యాచ్‌లు గెలవగా, బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకోవడంలో విజయం సాధించింది. బంగ్లాదేశ్ భారత పర్యటనకు ఇది మూడోసారి. భారత్ తన గడ్డపై బంగ్లాదేశ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడి మూడింటిలోనూ విజయం సాధించింది. ఇటీవలే పాకిస్థాన్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన తర్వాత వచ్చిన బంగ్లాదేశ్ జట్టు.. భారత్‌లోనూ తన రికార్డును మెరుగుపరుచుకోవాలనుకుంటోంది.
రెండు జట్లలో ప్లేయింగ్ 11
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.
బంగ్లాదేశ్: షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహిద్ రాణా కలరు.
ఇవి కూడా చదవండి:
Jasprit Bumrah: చరిత్ర సృష్టించేందుకు జస్ప్రీత్ బుమ్రా సిద్ధం.. రికార్డు సృష్టిస్తాడా
Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్
Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Read LatestSports News andTeluguNews