India vs Bangladesh: నేడు హైదరాబాద్‌లో భారత్, బంగ్లా మ్యాచ్.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, వర్షం ఉందా..
ABN , Publish Date - Oct 12 , 2024 | 07:33 AM
ఈరోజు భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో క్లీన్‌స్వీప్ చేసేందుకు టీమిండియా ప్రయత్నిస్తోంది. అయితే ఈ మ్యాచులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, వర్షం ఎఫెక్ట్ ఉందా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నేడు (అక్టోబర్ 12) భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో గెలిచి క్లీన్‌స్వీప్ చేసేందుకు టీమిండియా ప్రయత్నిస్తుంది. మరోవైపు ఈ మ్యాచులోనైనా కట్టడి చేయాలని బంగ్లా జట్టు భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీం ఇండియా తన ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఏ ఆటగాళ్లకు కొత్తగా ఛాన్స్ ఇస్తారు, ఈ మ్యాచులో ఎవరు గిలిచే ఛాన్స్ ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అవకాశం రాలేదు
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటి వరకు రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా, తిలక్ వర్మలకు ఈ సిరీస్‌లో అవకాశం రాలేదు. హర్షిత్ రానా తన అరంగేట్రం మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే మూడో మ్యాచ్‌లో హర్షిత్ రాణాకు సూర్యకుమార్ యాదవ్ అవకాశం ఇవ్వొచ్చు.
ఈ మ్యాచ్‌లో మయాంక్ యాదవ్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వవచ్చు. ఆయన స్థానంలో హర్షిత్ రానాకు మాత్రమే అవకాశం దక్కవచ్చు. IPL 2024లో KKR తరపున ఆడుతున్నప్పుడు హర్షిత్ రానా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆ క్రమంలో 18 వికెట్లు తీశాడు. ఆయన మిడిల్ ఓవర్లతో కొత్త బంతితో బౌలింగ్ చేయగలడు.
ఎవరు గెలుస్తారంటే..
అయితే ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మొదలుకానున్న ఈ మ్యాచుకు వర్షం ప్రభావం కూడా ఉంది. హైదరాబాద్ లో గత రెండు రోజులుగా పలు చోట్ల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో నేడు కూడా వర్షం కురిసే ఛాన్స్ 40 శాతం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరి మ్యాచ్ సమయానికి వర్షం కురుస్తుందో లేదో చూడాలి మరి. ఈ మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం టీమిండియా గెలించేందుకు 85 శాతం అవకాశం ఉండగా, బంగ్లాదేశ్ జట్టు గెలిచేందుకు 15 శాతం మాత్రమే ఛాన్స్ ఉంది.
ఇరు జట్లు
టీమ్ ఇండియా అంచనా జట్టులో సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, రింకూ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్
బంగ్లాదేశ్ జట్టు అంచనా జట్టులో షంటో (కెప్టెన్), పర్వేజ్, లిట్టన్ (కీపర్), తౌహిద్, మహ్ముదుల్లా, మెహ్దీహసన్, మెహ్దీహసన్ మిరాజ్, రిషద్, టస్కిన్, తన్జిమ్ సకీబ్, ముస్తాఫిజుర్
ఇవి కూడా చదవండి:
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More Sports News and Latest Telugu News