Share News

T20 World Cup 2024: నేడు టీమిండియా Vs కెనడా మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్, పిచ్ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Jun 15 , 2024 | 08:48 AM

టీ20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) 33వ మ్యాచ్ నేడు (జూన్ 15న) కెనడా (Canada), టీమ్ ఇండియా(team india) జట్ల మధ్య జరగనుంది. ఈ టోర్నీలో కెనడాతో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్. అదే సమయంలో టీ20 ప్రపంచ కప్‌లో కెనడా ఐర్లాండ్‌ను (CAN vs IRE) చిత్తు చేసి ఓడించింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కూడా టీమిండియా గెలవాలని చూస్తుండగా, కెనడా కట్టడి చేయాలని భావిస్తోంది.

T20 World Cup 2024: నేడు టీమిండియా Vs కెనడా మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్, పిచ్ ఎలా ఉందంటే..
India vs Canada 33rd Match Group A

టీ20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) 33వ మ్యాచ్ నేడు (జూన్ 15న) కెనడా (Canada), టీమ్ ఇండియా(team india) జట్ల మధ్య జరగనుంది. ఈ టోర్నీలో కెనడాతో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్. అదే సమయంలో టీ20 ప్రపంచ కప్‌లో కెనడా ఐర్లాండ్‌ను (CAN vs IRE) చిత్తు చేసి ఓడించింది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా అప్రమత్తంగా ఉండాలి.

ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఫ్లోరిడా(Florida)లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం లాడర్‌హిల్‌లో(Lauderhill) జరగనుంది. హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8లోకి ప్రవేశించిన భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కూడా టీమిండియా గెలవాలని చూస్తుండగా, కెనడా కట్టడి చేయాలని భావిస్తోంది.


పిచ్ రిపోర్ట్

ఈ పిచ్‌పై గ్రాస్ ఉంటుంది. ఈ మైదానాలు ఫుట్‌బాల్, రగ్బీ కోసం తయారు చేయబడ్డాయి. ఈ పిచ్‌లో తేమ ఉండవచ్చు. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువ మ్యాచ్‌లు గెలిచాయి. ఈసారి కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేయడానికి ఇష్టపడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరోసారి బ్యాట్స్ మెన్ ఆధిపత్యం కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ఇక్కడ వర్షం పడే అవకాశం కూడా ఉంది. ఫ్లోరిడాలో గత కొన్ని రోజులుగా వాతావరణం ప్రతికూలంగా ఉంది. భారీ వర్షాల కారణంగా అక్కడ వరదలు వచ్చే పరిస్థితి కూడా నెలకొంది.


విజయాలు

ఈ మైదానంలో భారత్ మొత్తం 8 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో టీమ్ ఇండియా ఐదు విజయాలు సాధించింది. రెండు చోట్ల ఓటమి చవిచూశారు. దీంతో అందరి దృష్టి టీమిండియా ఆటగాళ్లపైనే ఉంది. మీరు స్టార్ స్పోర్ట్స్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కెనడా (CAN), భారతదేశం (IND) మధ్య జరిగే ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అయితే ఈ మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే టీమిండియా 96 శాతం గెలిచే అవకాశం ఉండగా, కెనడా జట్టు 4 శాతం ఛాన్స్ ఉందని తెలిపింది.


టీమిండియా ప్రాబబుల్ 11లో రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

కెనడా ప్రాబబుల్ 11లో ఆరోన్ జాన్సన్, నవనీత్ ధాలివాల్, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయాస్ మొవ్వా (WK), రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్ (c), డిల్లాన్ హెల్లిగర్, కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్ కలరు.


ఇది కూడా చదవండి:

Gold and Silver Rate: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఈసారి ఎంతంటే..


Neet: నీటుకు చేటు



Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 09:20 AM