Share News

IPL 2024: నేడు DC vs SRH మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

ABN , Publish Date - Apr 20 , 2024 | 07:55 AM

నేడు ఐపీఎల్ 2024లో 35వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సన్‌రైజర్స్, హైదరాబాద్ జట్టుతో ఆడబోతుంది. వరుసగా రెండు విజయాలు నమోదు చేయడంతో ఢిల్లీ మళ్లీ పాంలోకి వచ్చింది. అదే సమయంలో SRH కూడా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠగా జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లలో ఏ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

 IPL 2024: నేడు DC vs SRH మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే
ipl 2024 DC vs SRH 35th match

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు కీలకమైన 35వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఢిల్లీ(delhi)లోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం(Arun Jaitley Stadium)లో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన SRH ఈ మ్యాచ్ కూడా గెలవాలని చూస్తోంది. మరోవైపు సొంత మైదానంలో జరిగే మ్యాచులో ఎలాగైనా విజయం సాధించాలని ఢిల్లీ జట్టు భావిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ 6వ స్థానంలో ఉండగా, హైదరాబాద్ 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి నాలుగో స్థానంలో ఉంది.


అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం(Arun Jaitley Stadium)లో ఈరోజు వర్షం కురిసే అవకాశం చాలా తక్కువ. ఢిల్లీలో సాయంత్రం 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఈ స్టేడియంలోని పిచ్‌ విషయానికి వస్తే ఇది బ్యాట్స్‌మెన్లకు అనుకూలమని తెలుస్తోంది. చాలా ఎక్కువ మ్యాచ్‌లు స్కోరింగ్ చేశాయి. ఇప్పటి వరకు ఇక్కడ 85 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. అందులో రెండో బ్యాటింగ్ చేసిన జట్లు 46 గెలిచాయి. ఇక్కడ అత్యధికంగా 1,047 పరుగులు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు.


ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్(DC), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. హైదరాబాద్‌ 12 సార్లు, ఢిల్లీ 11 సార్లు గెలిచాయి. SRHపై DC అత్యధిక స్కోరు 207 కాగా, ఢిల్లీపై హైదరాబాద్ అత్యధిక స్కోరు 219. ఇక ఈ మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 58 శాతం గెలిచే అవకాశం ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు 42 శాతం ఉంది.


ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (C), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ కలరు.

సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (wk), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, T నటరాజన్ ఉన్నారు.


ఇది కూడా చదవండి:

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఆ తప్పు కారణంగా..

Lok Sabha Elections 2024: మొదటి దశలో 63 శాతం దాటిన ఓటింగ్.. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ


మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Apr 20 , 2024 | 08:00 AM