Share News

IPL 2024: చెన్నై ఓటమికి కారణాలు చెప్పిన కెప్టెన్.. లక్నో గ్రాండ్ విక్టరీ

ABN , Publish Date - Apr 20 , 2024 | 07:21 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ సీజన్‌లో 34వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో, లక్నో జట్టు సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి గ్రాండ్ విక్టరీ సాధించింది.

IPL 2024: చెన్నై ఓటమికి కారణాలు చెప్పిన కెప్టెన్.. లక్నో గ్రాండ్ విక్టరీ
ruturaj gaikwad

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ సీజన్‌లో 34వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య నిన్న రాత్రి జరిగింది. ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో, లక్నో జట్టు సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన CSK 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

లక్నో(LSG) లక్ష్యాన్ని ఛేదించిన ఓపెనింగ్ జోడీ కేఎల్ రాహుల్(kl rahul), క్వింటన్ డి కాక్ తొలి వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా మ్యాచ్‌ను పూర్తిగా ఏకపక్షంగా మార్చారు. ఈ మ్యాచ్‌ను లక్నో 19 ఓవర్లలోనే ముగించడం విశేషం.


ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) ఓటమికి గల కారణాలను వెల్లడించారు. మా ఇన్నింగ్స్‌ను చాలా అద్భుతంగా ముగించామని, దీని నుంచి ఇంతకు మించి ఏమీ ఆశించలేమని ఆయన అన్నారు. పవర్‌ప్లే తర్వాత, మేము మా ప్రారంభాన్ని బాగా ముందుకు తీసుకెళ్లలేకపోయామని చెప్పారు. నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోవడం వల్ల మేము 14 నుంచి 15 ఓవర్ల వరకు త్వరగా పరుగులు చేయలేకపోయామని వెల్లడించారు.


వరుసగా వికెట్లు కోల్పోవడంతో 10 నుంచి 15 పరుగులు తక్కువ స్కోర్ చేశామని రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. అదనపు బ్యాట్స్‌మెన్స్ ఉన్నందున ఇంపాక్ట్ ప్లేయర్ నియమం కారణంగా స్కోర్‌ను కాపాడుకోవడం అంత సులభం కాదని పేర్కొన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకే వికెట్‌పై బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమే, కానీ రెండో ఇన్నింగ్స్‌లో మంచు కారణంగా పరుగులు చేయడం చాలా సులువైందన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం 180 నుంచి 190 పరుగులు చేస్తే మరింత బాగుండేదని వెల్లడించారు.


అంతేకాదు రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) బౌలర్ల గురించి కూడా ప్రస్తావించారు. పవర్‌ప్లే సమయంలో వికెట్లు తీయలేదని, దీంతో ప్రత్యర్థి జట్టు పుంజుకుందని అన్నారు. దీనిపై మనం ఇంకా కృషి చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత మన సొంత మైదానంలో జరిగే తదుపరి మ్యాచ్‌ని లక్నోతో ఆడాలని కూడా గుర్తు చేశారు. ఈసారి మేము లక్నో జట్టును ఆల్ అవుట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.


ఇది కూడా చదవండి:

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఆ తప్పు కారణంగా..

Lok Sabha Elections 2024: మొదటి దశలో 63 శాతం దాటిన ఓటింగ్.. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ


మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Apr 20 , 2024 | 07:29 AM