IPL 2024: నేటి RCB vs CSK మ్యాచ్ రద్దవుతుందా..బెంగళూరులో ప్రస్తుతం వెదర్ ఎలా ఉంది?
ABN , Publish Date - May 18 , 2024 | 05:40 PM
ఐపీఎల్ 2024(IPL 2024)లో ప్రస్తుతం అందరి దృష్టి నేడు (మే 18న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌పైనే ఉంది. బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనున్న ఈ 68వ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందా లేదా అని క్రీడాభిమానలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో ప్రస్తుతం అందరి దృష్టి నేడు (మే 18న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌పైనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో నాకౌట్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పోటీపడనుంది. వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడి ప్లేఆఫ్ రేసుకు దూరమైన ఈ జట్టు.. గత 5 మ్యాచ్‌ల్లో పునరాగమనం చేసి మళ్లీ రేసులోకి వచ్చింది. కానీ ఇప్పుడు చెన్నైపై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ సాధించడం ద్వారా ఈ జట్టు తదుపరి రౌండ్‌లో చోటు దక్కించుకుంటుంది. లేదంటే కష్టమనే చెప్పవచ్చు.
బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనున్న ఈ 68వ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉంది. బెంగళూరులో సాయంత్రం 5 గంటల వరకు వర్షం లేదు. కానీ మేఘాలు మేఘావృతమై(Weather) ఉన్నాయి. ఈ క్రమంలోనే చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటికే కవర్లు తీసేశారు. వర్షం కొన్ని గంటల సేపు రాకుండా ఉంటే మ్యాచ్ మొదలు కానుంది. మరోవైపు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ నేపథ్యంలో వర్షం వచ్చి ఈ మ్యాచ్ రద్దు అవుతుందా లేదా అని అనేక మంది క్రీడాభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: ధోనీ, నేను కలిసి ఆడడం ఇదే చివరి సారేమో.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
Virat Kohli: రిటైర్‌మెంట్‌పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. ఒక్కసారి వీడ్కోలు పలికితే..
Read Latest Sports News and Telugu News