Video: కాసేపట్లో SRH vs KKR మ్యాచ్..స్డేడియం దగ్గర అభిమానుల కోలాహలం
ABN , Publish Date - May 26 , 2024 | 06:39 PM
ఐపీఎల్ 2024(IPL 2024) 17వ సీజన్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఎందుకంటే కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియం(Chidambaram Stadium)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చిదంబరం స్టేడియానికి క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ఐపీఎల్ 2024(IPL 2024) 17వ సీజన్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఎందుకంటే కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియం(Chidambaram Stadium)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ జరగనున్న చెన్నైలోని చిదంబరం స్టేడియానికి క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో స్టేడియం వద్ద సందడి నెలకొంది.
దీంతో ప్రస్తుతం చెన్నైలోని చిదంబరం స్టేడియం దగ్గర సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్‌కతా నైట్ రైడర్స్( Kolkata Knight Riders) జట్ల టీషర్టులు ధరించి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. మరికొంత మంది ఆయా జట్లకు చెందిన జెండాలు పట్టుకుని ఉత్సాహంగా ఉన్నారు. అయితే చెన్నై.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు లేదా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సొంత మైదానం కాకపోవడం విశేషం.
ఆఖరి పోరు మాత్రం ఈ మైదానంలో జరుగుతోంది. దీంతో సొంత ప్రేక్షకులకు మాత్రం ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచులో అభిమానుల్లో క్రేజ్ ఉండడమే కాదు, వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే ఫైనల్ ట్రోఫీ చేజారీ పోతుందని హైదరాబాద్ జట్టు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి:
IPL 2024: ఐపీఎల్ 2024లో గెలిచిన.. ఓడిన జట్లకు ఎంత మనీ వస్తుంది..?
Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.
Read Latest Business News and Telugu News