Share News

పరుగుల వరద ఖాయమేనా?

ABN , Publish Date - Apr 05 , 2024 | 02:05 AM

ఐపీఎల్‌లో మరో పసందైన మ్యాచ్‌కు వేళైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంత మైదానంలో శుక్రవారం తలపడేందుకు సిద్ధమైంది. అయితే టోర్నీలో ఇప్పటి వరకు...

పరుగుల వరద ఖాయమేనా?
SRH vs CSK Match

కింగ్స్‌ను రైజర్స్‌ నిలువరించేనా!

హైదరాబాద్‌: ఐపీఎల్‌లో(IPL) మరో పసందైన మ్యాచ్‌కు వేళైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో(CSK) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) సొంత మైదానంలో శుక్రవారం తలపడేందుకు సిద్ధమైంది. అయితే టోర్నీలో ఇప్పటి వరకు ఏడు వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ సేవలు లేకపోవడం చెన్నైకి ఒకింత దెబ్బే. ముస్తాఫిజుర్‌ బంగ్లాదేశ్‌ వెళ్లడంతో..అతడి స్థానంలో శార్దూల్‌ను తీసుకొనే చాన్సుంది. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని హైదరాబాద్‌ను ఎదుర్కోవాలంటే సీఎ్‌సకే ఆల్‌రౌండ్‌ నైపుణ్యాలకు పదును పెట్టాల్సి ఉంటుంది. ఆర్సీబీ, గుజరాత్‌ జట్లను తొలి రెండు మ్యాచ్‌ల్లో మట్టికరిపించిన సీఎ్‌సకే..గత పోరులో ఢిల్లీ చేతిలో కంగుతిన్నది. ఢిల్లీపై మెరుపులు మెరిపించిన ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చి అలరించాలన్నది ఫ్యాన్స్‌ కోరిక. మరోవైపు స్వస్థలంలో ఉండే అనుకూలతలను పూర్తిగా వినియోగించుకోవాలని సన్‌రైజర్స్‌ భావిస్తోంది. ముంబైపై రికార్డు స్కోరు చేయడంతో బ్యాటింగ్‌ విభాగం రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అయితే గత మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో ఓటమి..హైదరాబాద్‌ నిలకడలేని ఆటకు అద్దం పట్టింది. ఈ స్టేడియంలో ముంబైతో మ్యాచ్‌లో 500కుపైగా పరుగులు నమోదయ్యాయి. దాంతో ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారే చాన్సుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2024 | 07:55 AM