Pat Cummins: అతడికి బౌలింగ్ చేయడం చాలా ప్రమాదకరం.. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలు!
ABN , Publish Date - May 20 , 2024 | 11:36 AM
ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈ ఐపీఎల్‌లో దుమ్మురేపుతోంది. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. లీగ్ దశలో పంజాబ్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చెలరేగింది.
ప్యాట్ కమిన్స్ (Pat Cummins) నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ ఈ ఐపీఎల్‌లో (IPL 2024) దుమ్మురేపుతోంది. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. లీగ్ దశలో పంజాబ్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చెలరేగింది. పంజాబ్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలనే పూర్తి చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై ప్రశంసలు కురిపించాడు. ``జట్టులోని కుర్రాళ్లు నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నారు. గెలవాలనే కసితో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అభిషేక్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడికి బౌలింగ్ చేయడం చాలా ప్రమాదకరం. అతడికి బౌలింగ్ చేయాలని నేనైతే కోరుకోను. పేస్, స్పిన్ బౌలింగ్‌ల్లోనూ అలవోకగా ఆడడం అతడి బలం. ఉప్పల్‌లో ఆడిన గత ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట్లో మేం గెలిచాం. స్వంత మైదానంలో అభిమానులను అలరించామనే అనుకుంటున్నా`` అని ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యానించాడు.
ఈ సీజన్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కోల్‌కతా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగే క్వాలిఫయర్-1లో తలపడతాయి. బుధవారం అదే వేదికలో జరిగే ఎలిమినేటర్-1లో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పోటీ పడతాయి. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుకు, ఎలిమినేటర్-1లో గెలిచిన జట్టుకు మధ్య శుక్రవారం మ్యాచ్ జరుగుతుంది. ఇక, చెన్నైలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: ధోనీ రిటైర్‌మెంట్‌పై సీఎస్కే క్లారిటీ.. మరో రెండు నెలల తర్వాత..
Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్.. కోహ్లీ ఆల్‌టైం రికార్డు ఔట్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..