Share News

Paris Olympics 2024: మరికొన్ని రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్.. ఈసారి భారత్ నుంచి గతంలో కంటే..

ABN , Publish Date - Jul 21 , 2024 | 07:09 AM

పారిస్ ఒలింపిక్స్ 2024(Paris Olympics 2024) ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ టోర్నీపై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రీడలు జులై 26 నుంచి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి.

Paris Olympics 2024: మరికొన్ని రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్.. ఈసారి భారత్ నుంచి గతంలో కంటే..
Paris Olympics 2024

పారిస్ ఒలింపిక్స్ 2024(Paris Olympics 2024) ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ టోర్నీపై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రీడలు జులై 26 నుంచి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. జులై 26న ప్రారంభోత్సవం, ఆగస్టు 11న ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. అయితే కొన్ని క్రీడలు జులై 24 నుండే ప్రారంభమవుతాయి.


భారత్ లక్ష్యం

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుక జులై 26న సీన్ నదిపై ఉన్న జార్డిన్స్ డు ట్రోకాడెరోలో జరగనుంది. స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించకపోవడం ఒలింపిక్స్‌లో ఇదే తొలిసారి. పారిస్ ఒలింపిక్స్ 2024 ఈ సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. పారిస్ ఒలింపిక్స్‌లో తొలిసారిగా రెండంకెల పతకాన్ని అధిగమించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.


117 మంది

2024 పారిస్ ఒలింపిక్స్‌కు భారతదేశం 117 మంది సభ్యుల బృందాన్ని(117 Indian athletes) పంపుతోంది. ఇది గత సీజన్ కంటే ఐదు మంది తక్కువ కావడం విశేషం. టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు జెండా బేరర్లుగా వ్యవహరించనున్నారు. అథ్లెట్లు ఇప్పటికే యూరప్‌లో శిక్షణను ప్రారంభించగా, త్వరలో పారిస్ ఒలింపిక్స్ కోసం ఫ్రాన్స్ చేరుకోనున్నారు. పారిస్‌లో భారత్‌కు చెందిన ఏకైక బంగారు పతక విజేత నీరజ్ చోప్రా తన టైటిల్‌ను కాపాడుకోవడంపై భారీ అంచనాలు ఉన్నాయి.


ప్రత్యక్ష ప్రసారం

పారిస్ గేమ్స్‌లో 32 క్రీడలు ఉండగా వాటిలో భారతదేశం 16 క్రీడలలో పాల్గొంటుంది. ఈ ఒలింపిక్స్ క్రీడలు భారతదేశంలో స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 18+ ఛానెళ్లలో ప్రత్యక్షంగా ప్రసారం(live telecast) చేయబడతాయి. దీంతోపాటు జియోసినిమా యాప్‌లో కూడా ఒలింపిక్స్‌ను వీక్షించవచ్చ. JioCinema పారిస్ ఒలింపిక్స్‌ను ఉచితంగా ప్రసారం చేస్తోంది.


ఇవి కూడా చదవండి:

పతకాలు పట్టుకొచ్చేదెవరు?


బ్యాంకులు భళా


Budget 2024: బడ్జెట్‌ 2024 నేపథ్యంలో పెరగనున్న స్టాక్స్ ఇవే..!


More Sports News and Latest Telugu News

Updated Date - Jul 21 , 2024 | 07:11 AM