Share News

IPL 2024: పంజాబ్ కింగ్స్ రికార్డు విక్టరీ..ప్రీతి జింటా హ్యాప్పీ, షారూఖ్ నిరాశ

ABN , Publish Date - Apr 27 , 2024 | 06:56 AM

ఐపీఎల్ 2024 (IPL 2024) చరిత్రలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు అతిపెద్ద స్కోరు లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌(kolkata knight riders)తో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 262 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్‌కతాపై సులువుగా గెలిచింది.

IPL 2024: పంజాబ్ కింగ్స్ రికార్డు విక్టరీ..ప్రీతి జింటా హ్యాప్పీ, షారూఖ్ నిరాశ
Punjab Kings record victory kolkata knight riders Preity Zinta happy

ఐపీఎల్ 2024 (IPL 2024) చరిత్రలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు అతిపెద్ద స్కోరు లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌(kolkata knight riders)తో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 262 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్‌కతాపై సులువుగా గెలిచింది. ఐదేళ్ల తర్వాత జానీ బెయిర్‌స్టో ఐపీఎల్‌లో సెంచరీ సాధించాడు.

ఈ మ్యాచులో మరికొన్ని రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇంత భారీ లక్ష్యాన్ని ఛేధించలేదు. టీ20 చరిత్రలో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా నమోదైంది. ఈ మ్యాచ్‌లో మొత్తం 42 సిక్సర్లు ఉన్నాయి. గతంలో అత్యధికంగా 38 సిక్సర్లు, అది కూడా ఈ ఏడాది ఐపీఎల్‌లో మార్చి 27న సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య నమోదైంది.


అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో స్క్రీన్ వెలుపల షారుఖ్ ఖాన్(Shahrukh khan), ప్రీతి జింటా(Preity Zinta) కనిపించారు. ఐపీఎల్‌లో ఇద్దరికీ జట్లు ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ ఓనర్లలో షారుఖ్ ఒకరు కాగా, ప్రీతి పంజాబ్ కింగ్స్‌కు సహా యజమాని. కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారూఖ్ ఖాన్ శుక్రవారం ఈడెన్ గార్డెన్స్‌లో ఆటను చూడటానికి అతని చిన్న కుమారుడు అబ్రామ్‌తో కలిసి వచ్చారు.

షారూఖ్ పోనీటైల్ జుట్టుతో గూగుల్స్ పెట్టుకుని నల్లటి టీ షర్ట్‌ను ధరించి కనిపించారు. అయితే కోల్‌కతా సొంత మైదానంలో మ్యాచ్ ఓడిపోవడం పట్ల షారుఖ్ నిరాశ చెందారు. పంజాబ్ ఆటగాళ్లు సిక్సర్లు కొట్టిన క్రమంలో కెమెరా పదే పదే షారూఖ్ ముఖంపై ఫోకస్ చేసింది. మరోవైపు ప్రీతి జింటా మాత్రం పంజాబ్ విక్టరీ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సిక్సర్లు బాదిన ప్రతిసారి చప్పట్లు కొడుతూ కనిపించారు.


గత కొన్ని సీజన్లలో KKR vs PBKS మ్యాచ్‌లలో షారుఖ్ రెగ్యులర్‌గా కనిపించలేదు. షారుక్ జట్టుపై ఆశలు కోల్పోతున్నాడా అనే అనుమానాలు వచ్చాయి. 2014 నుంచి KKR ట్రోఫీని గెల్చుకోలేదు. అందుకే నిరాశ చెందినట్లు తెలిసింది. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో షారుక్ భిన్నమైన మూడ్‌లో కనిపించారు. ఈసారి ట్రోఫీని తిరిగి గెల్చుకోవాలని షారూఖ్ జట్టు సభ్యులను పదే పదే ఉత్సాహపరచడం కనిపించింది.


ఇది కూడా చదవండి:

IPL PK Vs KKR : 262.. ఉఫ్‌

టైటిల్‌ నిలబెట్టుకునేనా?


Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 07:00 AM