Share News

Kamindu Mendis: 147 ఏళ్ల క్రికెట్ రికార్డును చిత్తు చేసిన శ్రీలంక బ్యాట్స్‌మెన్

ABN , Publish Date - Mar 25 , 2024 | 11:08 AM

147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో శ్రీలంక ఆటగాడు(Sri Lankan batsman) కమిందు మెండిస్(Kamindu Mendis) సరికొత్త రికార్డును సృష్టించాడు. అయితే ఈ ఆటగాడు రెండు ఇన్నింగ్స్‌లలో కూడా సెంచరీలు నమోదు చేశాడు.

Kamindu Mendis: 147 ఏళ్ల క్రికెట్ రికార్డును చిత్తు చేసిన శ్రీలంక బ్యాట్స్‌మెన్

147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో శ్రీలంక ఆటగాడు(Sri Lankan batsman) కమిందు మెండిస్(Kamindu Mendis) సరికొత్త రికార్డును సృష్టించాడు. అయితే ఈ ఆటగాడు రెండు ఇన్నింగ్స్‌లలో కూడా సెంచరీలు నమోదు చేశాడు. అందులో వింత ఏముంది అంటారా. కానీ కమిందు ఏడో నంబర్ ఆటగాడిగా వచ్చి ఈ ఘనతను సాధించడం విశేషం. ఆ క్రమంలో మెండిస్ 102, 164 పరుగులు చేశాడు. మెండిస్ 237 బంతుల్లో 164 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 127 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అయితే ఇదే ఇన్నింగ్స్‌లలో లంక తరఫున కెప్టెన్ ధనంజయ డిసిల్వా(Dhananjaya de Silva) కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ(102, 108 పరుగులు) సెంచరీలతో మెరిశాడు.

దీంతో మెండిస్, ధనంజయ డిసిల్వా(Dhananjaya de Silva) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన మూడో జోడీగా రికార్డుకెక్కారు. ఈ ఘనత సాధించిన ఇతర బ్యాట్స్‌మెన్లు గ్రెగ్ చాపెల్-ఇయాన్ చాపెల్ (ఆస్ట్రేలియా), మిస్బాహుల్ హక్-అజర్ అలీ (పాకిస్థాన్). బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు లంక తరఫున రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతో ఆటగాడు ఈ ఘనత సాధించాడు.


మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్(Bangladesh) ఐదు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 464 పరుగులు చేయాల్సి ఉంది. శ్రీలంక(Sri Lanka) రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 126 పరుగులకే కుప్పకూలింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే డిసిల్వా, మెండిస్ మళ్లీ ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు స్కోరు బోర్డుపై 173 పరుగులు జోడించారు. మెండిస్, ధనంజయ డిసిల్వా లంక తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 57 పరుగుల స్కోరును చేధించారు. ఇద్దరూ కలిసి 202 పరుగులు చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IPL 2024: ముంబై మ్యాచులో ట్విస్ట్.. గుజరాత్ గెలుపునకు వీరే ప్రధాన కారణం

Updated Date - Mar 25 , 2024 | 11:11 AM