Share News

Sunil Chhetri: ఒలింపిక్స్‌లో భారత పేలవ ప్రదర్శనపై సునీల్ ఛెత్రీ కామెంట్స్ వైరల్

ABN , Publish Date - Aug 01 , 2024 | 05:13 PM

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత్ పేలవమైన ప్రదర్శనపై భారత దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) తనదైన శైలిలో సమాధాన మిచ్చారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆశించిన స్థాయిలో పేరు రావడం లేదని సునీల్ ఛెత్రీ వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్‌గా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Sunil Chhetri: ఒలింపిక్స్‌లో భారత పేలవ ప్రదర్శనపై సునీల్ ఛెత్రీ కామెంట్స్ వైరల్
Sunil Chhetri

పారిస్ ఒలింపిక్స్‌ 2024(paris olympics 2024)లో భారత్ పేలవమైన ప్రదర్శనపై భారత దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) తనదైన శైలిలో సమాధాన మిచ్చారు. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆశించిన స్థాయిలో పేరు రావడం లేదని సునీల్ ఛెత్రీ వ్యాఖ్యానించారు. టోక్యో ఒలింపిక్స్‌లో 7 పతకాలు సాధించడం భారత్‌కు ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన అని గుర్తు చేశారు. కానీ పారిస్ ఒలంపిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌కు ఒక్క స్వర్ణ పతకం కూడా రాలేదని గుర్తు చేశారు. 150 కోట్ల జనాభా ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం క్రీడల్లో చాలా వెనుకబడి ఉందని సునీల్ ఛెత్రీ ఆవేదన వ్యక్తం చేశారు.


వైఫల్యం

ఈ క్రమంలో దేశంలోని యువత ప్రతిభను గుర్తించి వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించడంలో భారత్(bharat) వైఫల్యం చెందడమే ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించకపోవడానికి కారణమని అన్నారు. దేశంలో 150 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ, పతకాలు సాధించలేకపోతున్నారు. వాస్తవానికి 150 కోట్ల మందిలో ప్రతిభ ఉన్న వ్యక్తులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. కానీ ఈ విషయంలో మాత్రం చైనా, అమెరికా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు భారత్ కంటే చాలా మెరుగ్గా ఉన్నాయని సునీల్ ఛెత్రీ వెల్లడించారు.


ప్రతిభకు లోటు లేదు

ఈ క్రమంలో సుమారు 1.5 బిలియన్ల జనాభా ఉన్న దేశం(india) మరింత ప్రతిభను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. భారతదేశంలో ప్రతిభ ఉన్నప్పటికీ, వారిని తర్వాత స్థాయికి తీసుకెళ్లడానికి వారిని ప్రోత్సహించడానికి దృష్టి పెట్టడం లేదని సునీల్ ఛెత్రీ అన్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో ప్రతిభకు లోటు లేదు. కానీ ఆ టాలెంట్‌కు సరైన ప్రోత్సాహం లభించడం లేదన్నారు. ఈ క్రమంలో భారతీయ క్రీడా సంస్కృతి సంబంధించిన అంశం ఎప్పుడు వచ్చినా కూడా అభిప్రాయాన్ని ధైర్యంగా తెలియజేయాలని కోరారు.

క్రీడల విషయంలో వ్యాఖ్యలు చేశానని ఈసారి తనను ఎవరైనా చంపేస్తారేమోననే ఆందోళన కూడా లేదన్నారు సునీల్ ఛెత్రీ. కానీ ఇది నిజం అని స్పష్టం చేశారు. ప్రతిభను గుర్తించి, సరైన సమయంలో, సరైన పద్దతితో దానిని పెంపొందించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇక పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆశించిన దానికంటే మెరుగైన ప్రదర్శన చేసేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నం అద్భుతమన్నారు.


కొన్ని రాష్ట్రాలు

ఇక సునీల్ ఛెత్రీ కామెంట్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు ఇది నిజమని ఇండియాలో క్రీడల విషయంలో ఎక్కువగా ప్రాధాన్యత లేదని సునీల్ వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం దేశంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే క్రీడల విషయంలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయని అంటున్నారు. ఇంకొంత మంది మాత్రం క్రీడల విషయంలో రాజకీయాలు చేయకుండా ప్రతి రాష్ట్రంలోని ప్రభుత్వాలు చొరవ చూపిస్తే తప్పకుండా మెరుగైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని కామెంట్లు చేస్తున్నారు. ఇక సునీల్ ఛెత్రీ వ్యాఖ్యలపై మీరెమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.


ఇవి కూడా చదవండి..

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. షూటింగ్‌లో కాంస్యం గెల్చుకున్న స్వప్నిల్ కుసాలే

Anshuman Gaekwad: గైక్వాడ్ మృతి తీరని లోటు


Virat Kohli: కోహ్లీకి ఘోర అవమానం.. ప్రాక్టీస్ చేస్తుండగా అలా గేలి చేయడంతో సీరియస్.. వీడియో వైరల్!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 01 , 2024 | 05:17 PM