Team India: 150 పరుగులకే చేతులెత్తేసిన టీమిండియా.. టాప్ స్కోర్ ఎంతంటే..
ABN , Publish Date - Nov 22 , 2024 | 01:04 PM
పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నితీష్ రెడ్డి 41 పరుగులు మినహా ఏ ఒక్కరు కూడా పెద్దగా స్కోర్ చేయలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్లు విధ్వంసం సృష్టించి టీమిండియాను కట్టడి చేశారు.
ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా మొదలైన మొదటి టెస్టులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల ధాటికి టీమిండియా (team india) తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే కూప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా తరఫున జోష్ హేజిల్‌వుడ్ గరిష్టంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు. మిచెల్ మార్ష్ రెండు వికెట్లు తీశాడు. భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అత్యధికంగా 41 పరుగులు చేయడం విశేషం.
విరాట్ కోహ్లీ కూడా
తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు యశస్వి జైస్వాల్ ఖాతా తెరవలేకపోయాడు. అతడిని మిచెల్ స్టార్క్ అవుట్ చేశాడు. దీని తర్వాత మూడో స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కల్ కూడా సున్నాపై పెవిలియన్‌కు చేరుకున్నాడు. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఐదు పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ విరాట్‌ను ఉస్మాన్ ఖవాజా క్యాచ్ అవుట్ చేశాడు.
నితీష్ కుమార్ రెడ్డి
కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు వచ్చిన కేఎల్ రాహుల్ 74 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ 11 పరుగులు, వాషింగ్టన్ సుందర్ నాలుగు పరుగులు చేసి అవుటయ్యారు. 73 పరుగులకే 6 వికెట్లు పతనమైన తర్వాత రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డిలు ఇన్నింగ్స్ ను చేజిక్కించుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 78 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేసి పంత్ ఔటయ్యాడు. యువకుడు నితీష్ కుమార్ రెడ్డి ఒకవైపు గట్టిగా నిలబడ్డాడు. కానీ ఎవరూ మద్దతు ఇవ్వలేకపోయారు.
నెటిజన్లు కామెంట్లు
యువకుడు నితీష్ కుమార్ రెడ్డి ఒకవైపు గట్టిగా నిలబడ్డాడు. కానీ ఎవరూ కూడా సపోర్ట్ చేయలేకపోయారు. అరంగేట్రం చేసిన టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే నితీశ్ 59 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఈ సమయంలో నితీష్ 6 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. మరోవైపు రిషబ్ పంత్ 37, కేఎల్ రాహుల్ 26, హర్షిత్ రాణా 7, జస్ప్రీత్ బుమ్రా 8, కోహ్లీ 5, వాషింగ్టన్ సుందర్ 4 పరుగులు చేసి ఔట్ అయ్యారు.
సొంత మైదానాలలో
దీంతో పెర్త్‌లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ మొదటి రోజున భారత ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు సొంత మైదానాలలో ఆడటం కాదు. విదేశాల్లో కూడా ఆడాలని సూచనలిస్తున్నారు. పూర్తి జట్టులో ఒక్కరు కూడా 50 పరుగులు చేయలేకపోయాని విమర్శిస్తున్నారు. ఇక ఈ మ్యాచులో ఆస్ట్రేలియాను ఏ మేరకు కట్టడి చేస్తారో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి:
Virender Sehwag: సెహ్వాగ్ కొడుకు డబుల్ సెంచరీ.. వామ్మో.. తండ్రిని మించిన విధ్వంసం
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..
Read More Sports News and Latest Telugu News