India vs Australia: ఆసీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.. క్రెడిట్ మొత్తం ఈ బౌలర్ దే..
ABN , Publish Date - Nov 23 , 2024 | 10:15 AM
ఆస్ట్రేలియాలోని పెర్త్ మొదటి టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. 104 పరుగులకే ఆస్ట్రేలియా జట్టును టీమిండియా కట్టడి చేసింది. కానీ 45 ఏళ్ల రికార్డును టీమిండియా బద్దలు కొట్టకుండా నిలిచింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న పెర్త్ టెస్టులో టీమిండియా (India vs Australia) ఆధిక్యం సాధించింది. భారత బౌలర్ల (Bowlers) విధ్వంసం ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్ సత్తా విఫలమైంది. పెర్త్ టెస్టులో భారత్ నుంచి అత్యంత విజయవంతమైన బౌలర్ గా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నిలవడం విశేషం. ఈ మ్యాచులో బుమ్రా ఏకంగా ఐదు వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో హర్షిత్ రాణా 3, సిరాజ్ రెండు వికెట్లను తీశారు. దీంతో భారత బౌలర్ల విధ్వంసానికి ఆస్ట్రేలియా ఆటగాళ్లు మొత్తం 104 పరుగులు మాత్రమే చేయగలిగారు.
45 ఏళ్ల రికార్డు
ఈ క్రమంలో పెర్త్‌లో టీమ్ ఇండియా ఆధిక్యంలోకి వచ్చింది. కానీ 45 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టకుండా టీమిండియా నిలిచింది. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి టెస్టుల్లో అత్యల్ప స్కోరుతో ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా 45 ఏళ్ల రికార్డును టీమిండియా బద్దలు కొడుతుందని భావిచింది. కానీ సాధ్యం కాలేదు. చివరికి వచ్చిన ఆస్ట్రేలియా జోడీ పరుగులు తీసి ఆ రికార్డు సృష్టించకుండా అడ్డుకున్నారు.
చివరి జంట అతిపెద్ద భాగస్వామ్యాన్ని చేసింది
మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌ల చివరి జోడీ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు మంచి భాగస్వామ్యాన్ని అందించింది. వీరిద్దరూ 110 బంతులు ఎదుర్కొని స్కోరు బోర్డుకు 25 పరుగులు చేశారు. అంతకుముందు ఓపెనింగ్ జోడీ 14 పరుగులు చేసింది.
45 ఏళ్ల రికార్డు
భారత్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా అత్యల్ప స్కోరు 1981లో చేసిన 83 పరుగులు. పెర్త్‌లో తొలిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి.. ఆ 45 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతుందేమో అనిపించింది. కానీ రెండో రోజు ఆట ప్రారంభంలోనే ఆస్ట్రేలియా మరో 2 వికెట్లను భారత్ తీయడంతో ఈ ఆశ మరింత బలపడింది.
పంత్ క్యాచ్‌ని మిస్ చేయకుంటే..
అయితే పెర్త్‌లో పంత్ హేజిల్‌వుడ్ క్యాచ్‌ను వదులుకోకపోతే, తమతో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాను భారత్ అతి తక్కువ స్కోరుకే పరిమితం చేసి ఉండేది. కానీ ఆ క్యాచ్ మిస్ అవ్వడంతో స్టార్క్ తో పాటు హేజిల్ వుడ్ ఫెవికాల్ లాగా క్రీజులో అతుక్కుపోయారు. చివరికి మిచెల్ స్టార్క్‌ను అవుట్ చేయడంతో ఈ జోడికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వికెట్ హర్షిత్ రానా తీశాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న పెర్త్ టెస్టులో టీమిండియా ఆధిక్యం సాధించింది.
ఇవి కూడా చదవండి:
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..
Read More Sports News and Latest Telugu News