Share News

Team India: మూడో టీ20లో బంగ్లాపై భారత్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్ స్వీప్

ABN , Publish Date - Oct 13 , 2024 | 07:04 AM

భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 133 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌ను కూడా భారత జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకుంది.

Team India: మూడో టీ20లో బంగ్లాపై భారత్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్ స్వీప్
Team India defeated Bangladesh

ప్రపంచ ఛాంపియన్ టీమిండియా(team india) టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌పై(bangladesh) గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా మూడో, చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అదిరిపోయే బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. కేవలం 40 బంతుల్లోనే సంజూ శాంసన్ సాధించిన రికార్డు సెంచరీ సహా ఇతర ఆటగాళ్ల ఇన్నింగ్స్‌ ఆధారంగా భారత్ 297 పరుగుల ప్రపంచ రికార్డు స్కోర్ చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఈ స్కోరును చేరుకోకపోవడంతో టీమిండియా 133 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఈ సిరీస్‌ను కూడా భారత జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకుంది.


శాంసన్ సెంచరీ, సూర్య, హార్దిక్

సంజు శాంసన్ (111 పరుగులు, 47 బంతులు, 8 సిక్సర్లు, 11 ఫోర్లు) ఈ మ్యాచులో కీలక పాత్ర పోషించాడు. తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (75 పరుగులు, 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు). వీరిద్దరి తర్వాత రియాన్ పరాగ్ (34), హార్దిక్ పాండ్యా (47) పరుగులు చేశారు. చివరి ఓవర్‌లో 2 వరుస బంతుల్లో 2 వికెట్లు పడకుండా ఉంటే టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలో 300 పరుగులు చేసిన రెండో జట్టుగా, ఐసీసీ పూర్తి సభ్య దేశాలలో మొదటి జట్టుగా టీం ఇండియా నిలిచిపోయేది. భారత్ 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.


తగ్గిన హవా

ఈ భారీ స్కోరు ముందు బంగ్లాదేశ్ ఓటమి ఖాయమనిపించింది. ఈ క్రమంలో బంగ్లా ఆటగాళ్లు బ్యాటింగ్ వచ్చిన మొదటి బంతికే వికెట్ కోల్పోయారు. యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ వేసిన తొలి బంతికే ఓపెనర్ పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ ఔటయ్యాడు. ఆ తర్వాత కొన్ని బౌండరీలు దొరికాయి. కానీ వాషింగ్టన్ సుందర్ వెంటనే రెండవ ఓవర్‌లో తంజీద్ హసన్‌ను ఔట్ చేశాడు. తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో కూడా ముందుగానే నిష్క్రమించాడు. ఇక లిటన్ దాస్ (42) దూకుడు వైఖరితో ఆడి కొంచెం సపోర్ట్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి ఓవర్‌లో 5 ఫోర్లు కొట్టాడు.


సెంచరీ చేసినా

లిట్టన్‌తో పాటు తౌహీద్ హృదయ్ (63) కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే లిట్టన్ ఔట్ అయిన వెంటనే, ఇన్నింగ్స్ వెనుకబడింది. తౌహీద్ హాఫ్ సెంచరీ చేసినా జట్టు మొత్తం 20 ఓవర్లలో 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి టీ20కి తిరిగి భారత జట్టులోకి వచ్చిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. మయాంక్ యాదవ్ ఇద్దరిని ఔట్ చేయగా, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి చెరో ఒక్కరిని ఔట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Read More Sports News and Latest Telugu News

Updated Date - Oct 13 , 2024 | 07:05 AM