India vs Sri Lanka: శ్రీలంక టూర్.. కోహ్లీ, రోహిత్‌ల నుంచి ఊహించని ట్విస్ట్
ABN , Publish Date - Jul 18 , 2024 | 08:05 PM
భారత జట్టు టీ20 వరల్డ్‌కప్ సాధించిన తర్వాత సీనియర్ ఆటగాళ్లు కొంతకాలం పాటు విరామం తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో..
భారత జట్టు టీ20 వరల్డ్‌కప్ సాధించిన తర్వాత సీనియర్ ఆటగాళ్లు కొంతకాలం పాటు విరామం తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) పాటు విరాట్ కోహ్లీ (Virat Kohli), జస్‌ప్రీత్ బుమ్రా విశ్రాంతి కోరారని.. అందుకు బీసీసీఐ నుంచి సమ్మతి లభించిందని గతంలో ప్రచారం జరిగింది. దీంతో.. శ్రీలంక టూర్‌లో వాళ్లు జట్టులో భాగం కారని అంతా అనుకున్నారు. కానీ.. అదంతా ఒట్టి ప్రచారమేనని తాజాగా తేలిపోయింది. బీసీసీఐ ప్రకటించిన వన్డే జట్టులో ఆ ఇద్దరు సీనియర్లు కూడా ఉన్నారు. అంతేకాదు.. ఎప్పట్లాగే రోహిత్ శర్మకు వన్డే జట్టు నాయకత్వ పగ్గాలు అప్పగించారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అభ్యర్థన మేరకు.. రోహిత్, కోహ్లీ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో.. టీ20 జట్టుని కూడా బీసీసీఐ ప్రకటించింది. గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే.. ఈ జట్టుకి సూర్యకుమార్ యాదవ్‌ను (Suryakumar Yadav) కెప్టెన్‌గా నియమించింది. అంతేకాదు.. ఈసారి యువ ఆటగాళ్లకే టీమిండియా మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది. జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యంగ్ ప్లేయర్స్ అద్భుతంగా రాణించారు కాబట్టి.. మరోసారి వారినే శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మైదానంలో ప్రిన్స్‌గా పేరొందిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) పెద్ద ప్రమోషనే కొట్టేశాడు. టీ20 జట్టుకే కాకుండా.. వన్డే జట్టుకి కూడా అతడినే వైస్-కెప్టెన్‌గా నియమించారు. ఈ లెక్క ప్రకారం.. రోహిత్ లేని సమయంలో వన్డే సిరీస్‌లకు అతడే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని అర్థంచేసుకోవచ్చు.
టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
Read Latest Sports News and Telugu News