Sumit Nagal: ఆర్థిక సంక్షోభ సమయంలో కోహ్లీ చాలా సపోర్ట్ చేశాడు
ABN , Publish Date - Jan 16 , 2024 | 09:08 PM
భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ మంగళవారం చరిత్ర సృష్టించాడు. 1989 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సీడెడ్ ఆటగాడిని ఓడించిన భారత్ నుంచి అతను మొదటి ఆటగాడిగా నిలిచాడు. అయితే నాగల్ ఆర్థిక సంక్షోభ సమయంలో కోహ్లీ సపోర్ట్ చేశారనే చెప్పిన అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్(Sumit Nagal) అదరగొట్టాడు. మంగళవారం కజకిస్థాన్‌కు చెందిన అలెగ్జాండర్ బుబ్లిక్‌ను ఓడించి రెండో రౌండ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాగల్ 6-4, 6-2, 7-6 (7-5)తో బుబ్లిక్‌ను ఓడించాడు. ఈ విజయం తర్వాత సుమిత్ నాగల్ 1989 నుంచి గ్రాండ్ స్లామ్‌లో సీడెడ్ పురుషుల సింగిల్స్ ప్లేయర్‌పై విజయం సాధించిన మొదటి భారత టెన్నిస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
2013 తర్వాత సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు చేరిన తొలి భారతీయ పురుషుల ఆటగాడు నాగల్. సోమ్‌దేవ్ దేవ్‌బర్మన్ 2013లో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 1989 తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సింగిల్స్ మ్యాచ్‌లో భారత ఆటగాడు సీడెడ్ ప్లేయర్‌ను ఓడించాడు. రమేష్ కృష్ణన్ 1989లో దీన్ని సాధించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ICC: ఆ క్రికెటర్‌పై అవినీతి ఆరోపణలు..రెండేళ్ల నిషేధం
ఈ నేపథ్యంలో సుమిత్ నాగల్ గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఇదే సుమిత్ నాగల్‌కి భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) హెల్ప్ చేశాడనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజానికి సుమిత్ నాగల్‌కు విరాట్ కోహ్లి ఎప్పుడూ అండగా నిలుస్తున్నాడు. నాగల్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న దశలో ఉన్నప్పుడు విరాట్ ముందుకు వచ్చి సుమిత్‌కు బహిరంగంగా సహాయం చేశాడు. అప్పుడు విరాట్ సహాయం పొందకపోతే తన కెరీర్‌ను కోల్పోయేవాడినని ఈ విషయాన్ని నాగల్ స్వయంగా 2019లో ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించాడు.
నాగల్ తన జేబులో కేవలం ఆరు డాలర్లు మాత్రమే ఉన్న సమయంలో కోహ్లీ, అతని ఫౌండేషన్ తనకు ఎలా మద్దతు ఇచ్చాయో చెప్పాడు. 2017 నుంచి విరాట్ కోహ్లీ ఫౌండేషన్ తనకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. తాను గత రెండేళ్లుగా రాణించలేక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు.
2019 ప్రారంభంలో తాను ఒక టోర్నమెంట్ తర్వాత కెనడా నుంచి జర్మనీకి విమానంలో వెళ్తున్న క్రమంలో తన పర్సులో కేవలం ఆరు డాలర్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఆ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని బయటపడినట్లు చెప్పారు. ఇలాంటి క్రమంలో అథ్లెట్లకు నిధులు సమకూరిస్తే దేశంలో క్రీడలు(sports) మరింత అభివృద్ధి చెందుతాయని నాగల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే విరాట్ నుంచి తనకు సపోర్ట్ లభించడం తన అదృష్టమని నాగల్ వెల్లడించారు.