India vs Pakistan: పాకిస్తాన్ పరుగులకు బ్రేక్.. అదరగొట్టిన ఉమెన్స్ టీమిండియా
ABN , Publish Date - Oct 06 , 2024 | 05:18 PM
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత బౌలర్లు విధ్వంసం సృష్టించారు. పాకిస్తాన్‌కు చెందిన అందరు ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపించారు. దీంతో పాకిస్తాన్ జట్టు ఎన్ని పరుగులు చేసిందనే విషయాలను ఇక్కడ చుద్దాం.
ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్‌లో ఈరోజు భారత్(team india), పాకిస్తాన్(pakistan) మధ్య కీలక మ్యాచ్ కొనసాగుతోంది. ఇద్దరు చిరకాల ప్రత్యర్థుల మధ్య ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. దీనిలో పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో భారత మహిళల జట్టు 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఇక భారత్ తరఫున అరుంధతి రెడ్డి మూడు వికెట్లు తీయగా, శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. సెమీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాల్సిందే.
భారత్ లక్ష్యం
ఈ క్రమంలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ జట్టును కేవలం 105 పరుగులకే కట్టడి చేశారు. దీంతో భారత్‌కు 106 పరుగుల విజయలక్ష్యం నిర్ణయించారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో కూడా భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ పేలవంగానే ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. పాకిస్తాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో నిదాదార్ మాత్రమే 28 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఇప్పటివరకు శుభారంభం చేయలేదు. భారత్ తన తొలి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఓడిపోయింది. కివీస్ జట్టు 58 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది. మరోవైపు శ్రీలంకను ఓడించి పాకిస్తాన్ టోర్నీని ప్రారంభించింది.
ఇది రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్:
భారత మహిళల ప్లేయింగ్ ఎలెవన్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, ఎస్ సజ్నా, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్.
పాకిస్థాన్ మహిళల ప్లేయింగ్ ఎలెవన్: మునిబా అలీ (వికె), గుల్ ఫిరోజ్, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా (సి), తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరుబ్ షా, సాదియా ఇక్బాల్.
ఇవి కూడా చదవండి:
Viral Video: కిమ్ జోంగ్, సోరేస్‌తో డిన్నర్ గురించి జైశంకర్‌కు ప్రశ్న.. షాకింగ్ అన్సార్
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More Business News and Latest Telugu News