India vs Pakistan: పాకిస్తాన్‌పై ఉమెన్స్ టీమిండియా గ్రాండ్ విక్టరీ..సెమీస్ ఆశలు సజీవం
ABN , Publish Date - Oct 06 , 2024 | 06:49 PM
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో నేడు జరిగిన ఇండియా, పాకిస్తాన్ ఉత్కంఠ మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ (team india), పాకిస్తాన్ (Pakistan) జట్ల మధ్య దుబాయ్‌లో హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచులో ఉమెన్స్ టీమిండియా విజయం సాధించింది. అయితే ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ క్రమంలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఇక 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ఎట్టకేలకు పూర్తి చేసింది. దీంతో ఉమెన్స్ టీమిండియా తమ రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో ప్రధానంగా షఫాలీ వర్మ 38, హర్మన్‌ప్రీత్ కౌర్ 29, జెమ్మియా రోడ్రిగ్స్ 23 పరుగులు చేశారు.
సెమీస్ ఆశలు
పాకిస్తాన్ తరఫున కెప్టెన్ ఫాతిమా సనా రెండు వికెట్లను పడగొట్టగా, సాదియా ఇక్బాల్, ఒమైమా సోహైల్ చెరో వికెట్ తీశారు. ఇక భారత్ తరఫున అరుంధతి రెడ్డి మూడు వికెట్లు తీయగా, శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లను పడగొట్టారు. అయితే సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలనుకున్న తరుణంలోనే విజయం సాధించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు ఈసారి 16వ సారి తలపడ్డాయి. ఇంతకు ముందు ఆడిన 15 మ్యాచ్‌ల్లో భారత మహిళలు 12-3తో పాకిస్తాన్‌పై పైచేయి సాధించారు. అంటే భారత్ 12 మ్యాచ్‌లు గెలిస్తే, 3 మ్యాచ్‌లు పాకిస్తాన్ జట్టుకు దక్కాయి.
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్తాన్
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్తాన్ మధ్య ఇది రెండో మ్యాచ్. దీనికి ముందు భారత్ తన మొదటి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడింది. ఇందులో 58 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. మరోవైపు పాకిస్తా్ జట్టు తన తొలి మ్యాచ్‌ని శ్రీలంకతో ఆడింది. అందులో పాక్ విజయంతో టోర్నీని ప్రారంభించింది.
ఇరు జట్ల ప్లేయింగ్ XI
భారత ప్లేయింగ్ XIలో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్జ్, రిచా ఘోష్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, సజ్జన, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా సింగ్ ఉన్నారు.
పాకిస్తాన్ ప్లేయింగ్ XIలో మునిబా అలీ, గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, ఒమాయా సోహైల్, నిదా దార్, తుబా హసన్, ఫాతిమా సనా (సి), అలియా రియాజ్, అరుబ్ షా, నష్ర్ సంధు, సాదియా ఇక్బాల్ కలరు.
ఇవి కూడా చదవండి:
Viral Video: కిమ్ జోంగ్, సోరేస్‌తో డిన్నర్ గురించి జైశంకర్‌కు ప్రశ్న.. షాకింగ్ అన్సార్
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More Sports News and Latest Telugu News