Yuvraj Singh: ఆల్ టైమ్ ప్లేయింగ్ XI ప్రకటించిన యువరాజ్ సింగ్.. ధోనీకి లభించని స్థానం..!
ABN , Publish Date - Jul 14 , 2024 | 03:49 PM
వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం పలువురు భారత మాజీ ఆటగాళ్లు ప్లేయింగ్ లెవెన్, టాప్ త్రీ బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేశారు.
వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ (World Championship of Legends) టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను (Ind vs Pak) ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం పలువురు భారత మాజీ ఆటగాళ్లు ప్లేయింగ్ లెవెన్, టాప్ త్రీ బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేశారు. ముందుగా యువరాజ్ (Yuvraj Singh) తనకు నచ్చిన ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ లెవన్‌ను ఎంపిక చేశాడు. అందులో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు కల్పించాడు.
యువరాజ్ ప్రకటించిన ప్లేయింగ్ లెవెన్‌లో సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని తీసుకున్నాడు. అయితే టీమిండియాకు నాయకత్వం వహించి రెండు ఐసీసీ టోర్నీలు అందించిన ధోనీ (MS Dhoni)ని మాత్రం పక్కనపెట్టాడు. అలాగే తనను తాను 12వ ఆటగాడిగా ఎంపిక చేసుకున్నాడు.
యువరాజ్ ప్లేయింగ్ XI (Yuvraj Singh playing XI): సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లీర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్.
ఇక, హర్భజన్ టాప్ త్రీ బ్యాటర్స్‌గా సచిన్ టెండూల్కర్, జాక్వెస్ కలిస్, బ్రియాన్ లారాలను ఎంపిక చేశాడు. అలాగే రాబిన్ ఊతప్ప.. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, వివియన్ రిచర్డ్స్‌లను తన టాప్ త్రీ బ్యాటర్స్‌గా ప్రకటించాడు. సురేష్ రైనా మాత్రం తన టాప్ త్రీ బ్యాటర్స్ లిస్ట్‌లో కోహ్లీ, రోహిత్ శర్మలకు స్థానం కల్పించాడు. మూడో బ్యాటర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్‌ను ఎంచుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్.. కోహ్లీ, రోహిత్‌లకూ సాధ్యం కాలేదు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..