Survey Completion: 90% పూర్తయిన కుటుంబ సర్వే..
ABN , Publish Date - Nov 24 , 2024 | 03:27 AM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే 90 శాతం పూర్తయింది. సర్వేలో మొత్తం 1,16,93,698 నివాసాలు గుర్తించగా శనివారం వరకు 1,05,03,257 (90శాతం) నివాసాలలో సర్వే పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
కంప్యూటరీకరణ ప్రారంభం
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే 90 శాతం పూర్తయింది. సర్వేలో మొత్తం 1,16,93,698 నివాసాలు గుర్తించగా శనివారం వరకు 1,05,03,257 (90శాతం) నివాసాలలో సర్వే పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సర్వే పూర్తయిన కుటుంబాలకు సంబంధించిన వివరాల కంప్యూటకరీకరణ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించింది. 2,61,384 నివాసాలకు సంబంధించిన సర్వే వివరాలు కంప్యూటరీకరణ పూర్తయిందని ప్రభుత్వం తెలిపింది. కాగా, సర్వే డేటా నమోదులో తప్పులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. డేటా ఎంట్రీ వివరాల నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. సర్వే పత్రాల భద్రత విషయంలో తాగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.