Share News

Vikarabad: లగచర్ల ఘటన ప్రభుత్వ కుట్ర

ABN , Publish Date - Nov 24 , 2024 | 03:39 AM

వికారాబాద్‌ జిల్లా లగచర్లలో జరిగిన ఘటన ప్రభుత్వ కుట్రేనని.. కలెక్టర్‌, అధికారులపై దాడి కాదని, అది ధర్మాగ్రహమేనని, దాన్ని సాకుగా తీసుకుని గ్రామాలను వల్లకాడు చేస్తున్నారని సేవాలాల్‌సేన, పౌరహక్కుల సంఘం, గిరిజన సంఘాలు ఆరోపించాయి.

Vikarabad: లగచర్ల ఘటన ప్రభుత్వ కుట్ర

  • సేవాలాల్‌సేన, పౌరహక్కుల సంఘం గిరిజన సంఘాల ఆరోపణ

పంజాగుట్ట, నవంబరు23 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా లగచర్లలో జరిగిన ఘటన ప్రభుత్వ కుట్రేనని.. కలెక్టర్‌, అధికారులపై దాడి కాదని, అది ధర్మాగ్రహమేనని, దాన్ని సాకుగా తీసుకుని గ్రామాలను వల్లకాడు చేస్తున్నారని సేవాలాల్‌సేన, పౌరహక్కుల సంఘం, గిరిజన సంఘాలు ఆరోపించాయి. రాష్ట్రంలో రాక్షస పాలన, పోలీసు రాజ్యం సాగుతోందని, రాష్ట్రాన్ని నడుపుతోంది రేవంత్‌ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అని ఆరోపించారు.


శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సేవాలాల్‌ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు భూక్య సంజీవ్‌ నాయక్‌, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌, ఓయూ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు నెహ్రూ నాయక్‌, తదితరులు మాట్లాడారు.గిరిజనులు, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, కలెక్టర్‌, పోలీసులపై కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. భూసేకరణ ఫార్మా కంపెనీల కోసం కాదని అంటున్న ప్రభుత్వం గవర్నర్‌ విడుదల చేసిన గెజిట్‌ లో ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ అని చెప్పిందని గుర్తుచేశారు. భూసేకరణను నిలిపివేయాలని, గిరిజనులతో సీఎం చర్చలు జరిపి పరిష్కార మార్గం కనుగొనాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 24 , 2024 | 03:39 AM